ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: మరదలి ఇంటి నుంచి రాగానే.. భార్యకు చికెన్ వండి పెట్టిన భర్త.. కాసేపటికి స్థానికులు వచ్చి చూడగా షాకింగ్ సీన్..

ABN, First Publish Date - 2023-06-25T21:05:45+05:30

ఐదుగురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యకు తెలీకుండా అతను చేసిన పని చివరకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ రోజు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యకు తెలీకుండా అతను చేసిన పని చివరకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టింది. ఇటీవల ఓ రోజు మరదలి ఇంటి నుంచి రాగానే.. భార్యకు చికెన్ వండి పెట్టాడు. కాసేపటికి స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీ పరిధి ప్రేమ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంజీవ్ అనే వ్యక్తి.. భార్య రేఖా, ఐదు మంది పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సంతోషంగా సాగుతున్న వీరి సంసారంలో భర్త కారణంగా అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. అందుకు విరుద్ధంగా మరదలిపై ప్రేమ (love) పెంచుకున్నాడు. ఆమెకు కూడా ఇతన్ని ఇష్టపడడంతో భార్యకు (wife) తెలీకుండా తరచూ కలుస్తూ ఉండేవాడు. వీరి వివాహేతర సంబంధం (extramarital affair) విషయం ఆ నోటా, ఈ నోటా పడి.. చివరకు భార్యకు తెలిసింది. అప్పటి నుంచి దంపతులిద్దరూ ఇదే విషయమై గొడవలు (quarrels) పడుతుండేవారు. ఇటీవల ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి.

Crime News: స్నేహితుడి భార్యపై కన్నేసిన యువకుడు.. చివరకు ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్.. ఓ రోజు చెరువు గట్టు వద్ద..

ఈ క్రమంలో శనివారం సంజీవ్.. ఇంట్లో సొంతంగా చికెన్ తయారు చేశాడు. వంట చేసిన అనంతరం మరదలిని కలిసేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకుని భార్య కూడా అతడి వెంటే వెళ్లింది. మరదలి వద్ద ఉండగా సడన్‌గా అక్కడికి వచ్చిన భార్య వారితో గొడవ పడింది. దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవపడుతూనే ఉన్నారు. ఆ సమయంలో సంజీవ్ తాను చేసిన చికెన్‌లో (drugged chicken) మత్తు మందు కలిపాడు. అది తిన్న భార్య కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తర్వాత భార్యపై కత్తితో దాడి (husband attacked the wife) చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విన్న స్థానికులు పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చి ఆమెను చూసి షాక్ అయ్యారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Marriage: వధువు మెడలో దండ వేసిన తర్వాత పారిపోయిన వరుడు.. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..

Updated Date - 2023-06-25T21:05:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising