ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Digital Payment Alert: సారీ.. మీ ఫోన్‌పేకు పొరపాటున రూ.100 పంపాం.. తిరిగి పంపించండి ప్లీజ్.. అని ఎవరైనా ఫోన్‌కాల్ చేస్తే..!

ABN, First Publish Date - 2023-03-21T20:58:38+05:30

నగదు రహిత లావాదేవీల సౌకర్యం అందుబాటులోకి రావడంతో గూగుల్, ఫోన్ పే, పేటీఎం తదితరాలను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకూ ఈజీగా పంపే అవకాశం ఉండడంతో ఎక్కవ మంది డిజిటల్ లావాదేవీల వైపే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నగదు రహిత లావాదేవీల సౌకర్యం అందుబాటులోకి రావడంతో గూగుల్, ఫోన్ పే, పేటీఎం తదితరాలను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. రూపాయి దగ్గర నుంచి లక్షల వరకూ ఈజీగా పంపే అవకాశం ఉండడంతో ఎక్కవ మంది డిజిటల్ లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. మోసాలు కూడా అంతే స్థాయిలో జరుగుతుంటాయి. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ కొత్త రకం పద్ధతుల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. సారీ.. మీ ఫోన్‌పేకు పొరపాటున రూ.100 పంపాం.. తిరిగి పంపించండి ప్లీజ్.. అని ఎవరైనా ఫోన్‌కాల్ చేస్తే.. ఇక మీరు వారి చేతిలో మోసపోతున్నారని అర్థం. ఈ విషయంలో ఈ ఇక్క మిస్టేక్ చేస్తే మాత్రం మీ ఖతా ఖాళఈ అయినట్లే..

ముంబైలో (Mumbai) ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ కేవైసీ, పాన్ తదితర స్కామ్‌ల (Bank KYC, PAN scam) ద్వారా కేవలం 16 రోజుల్లో 81మంది నుంచి సుమారు కోటి రూపాయలు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను మరువకముందే మరో కొత్త రకం సైబర్ నేరం బయటపడింది. సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) రోజుకో కొత్త రకం మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ముందుగా వారు ఏదో ఒక నంబర్‌కు రూ.10, రూ.20, రూ.50, రూ.100.. ఇలా ఎంతో కొంత మొత్తాన్ని ఫోన్ పే, గూగుల్ పే (Phone Pay, Google Pay) ద్వారా పంపిస్తారు.

Wife: ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

తర్వాత కాసేపటికి ఫోన్ చేసి, సారీ.. మీ ఫోన్‌పేకు పొరపాటున రూ.100 పంపాం.. తిరిగి పంపించండి ప్లీజ్.. అని అంటారు. అనంతరం అదే నంబర్‌కు నగదు లావాదేవీలకు సంబంధించిన స్క్రీన్ షాట్ (Screen shot) పంపి, చాటింగ్ చేస్తాడు. స్క్రీన్ షాట్ చూసి వారి నగదును తిరిగి పంపే క్రమంలో చాటింగ్ (Chatting) చేశారంటే మాత్రం ఇక మీరు బుక్కపోయినట్లే. చాటింగ్ చేసే క్రమంలో అవతలి వ్యక్తి వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను (Bank details) తస్కరిస్తారు. తర్వాత మీ అకౌంట్‌లోని నగదును ఖాళీ చేసేస్తారు. అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు.. వారికి మెసేజ్‌లూ చేయొద్దని, నేరుగా సంప్రదించి డబ్బులు తీసుకోమని చెప్పాలని.. సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Super Splendor: ఏ బైక్‌కు అయినా రెండే కదా.. దీనికేంటి మూడు టైర్లున్నాయని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడు దీన్నెలా మార్చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-03-21T20:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising