Snakes: ఈ రెండు పాములు పగబట్టాయా..? 3 రోజుల క్రితం ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలను కాటేసి చంపిన ఈ సర్పాలే.. మళ్లీ ఇప్పుడు..!
ABN, First Publish Date - 2023-09-27T18:38:06+05:30
పాములు పగబడతాయో లేదో తెలీదు గానీ.. అప్పడప్పుడూ ఈ వాదనను బలపరుస్తూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తాము అనుకున్నదే నిజం అని అనుకుంటూ ఉంటారు. తాజాగా..
పాములు పగబడతాయో లేదో తెలీదు గానీ.. అప్పడప్పుడూ ఈ వాదనను బలపరుస్తూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తాము అనుకున్నదే నిజం అని అనుకుంటూ ఉంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న విషాద ఘటన కూడా ఇలాంటి అనుమానాలనే రేకెత్తించింది. పాము కాటుతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అయితే తర్వాత మూడు రోజులకే తండ్రిని కూడా అదే పాములు కాటేశాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రతాప్‌గఢ్ జిల్లా లాల్‌గంజ్ కొత్వా ఖానే ప్రాంతానికి చెందిన ధాధువా గజన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో సెప్టెంబర్ 20న విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బబ్లూ యాదవ్ కుమారులైన అగం యాదవ్, అర్నవ్ యాదవ్ (7) రాత్రి ఇంట్లో మంచంపై నిద్రపోతుండగా.. రెండు పాములు లోపలికి వచ్చాయి. ఈ క్రమంలో మంచంలో పడుకుని ఉన్న పిల్లలిద్దరినీ (Snakes biting children) పాములు కాటేశాయి. కాటు వేయగానే నొప్పితో కేకలు వేయడంతో తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ వచ్చారు. అయితే అప్పటికే పాములు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకే దూసుకొచ్చిన రైలు.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. కళ్లముందే తమ పిల్లలు విగతజీవులుగా మారిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే విషాద ఘటన నుంచి వారు కోలుకోక ముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత.. మళ్లీ రెండు పాములు ఇంట్లోకి వచ్చి మరీ (snakes biting father) తండ్రిని కాటేశాయి. దీంతో అతన్ని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. పిల్లలను కాటేసిన రెండు పాములు.. మళ్లీ తండ్రిని కాటేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో.. చివరకు పాములు పట్టే వారిని పిలిపించారు. ఎట్టకేలకు వారు ఆ పాములను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుండగా, పాము కాటుకు చిన్నారులు చనిపోవడంతో ప్రభుత్వం రూ.8లక్షల సాయం ప్రకటించింది. అయితే ఆ చెక్కను తీసుకునేందుకు తండ్రి నిరాకరించాడు. కాగా, తండ్రీ, కొడుకులను కాటేసిన పాములకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-27T18:38:06+05:30 IST