ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వర్షాల్లో కొట్టుకుపోతున్న గ్యాస్ సిలిండర్లు.. నెట్టింట వీడియో వైరల్..!

ABN, First Publish Date - 2023-07-24T16:47:29+05:30

భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలో గ్యాస్ సిలిండర్లు సైతం కొట్టుకుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణ గుజరాత్‌లోని నవసారిలో గల ఓ గ్యాస్ గౌడౌన్‌లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 14.8 కిలో గ్రాముల బరువు ఉండే గ్యాస్ సిలిండర్లు సైతం వరద నీటిలో ఒక బంతిలా సునాయసంగా కొట్టుకుపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

గుజరాత్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల దెబ్బకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎంతో మంది నిరాశ్రయులుగా మారారు. పంటలు దెబ్బతిన్నాయి. నవ్‌సారి, జునాఘర్ జిల్లాల్లో ఏకంగా ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 943 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలో గ్యాస్ సిలిండర్లు సైతం కొట్టుకుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దక్షిణ గుజరాత్‌లోని నవసారిలో గల ఓ గ్యాస్ గౌడౌన్‌లో ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. 14.8 కిలో గ్రాముల బరువు ఉండే గ్యాస్ సిలిండర్లు సైతం వరద నీటిలో ఒక బంతిలా సునాయసంగా కొట్టుకుపోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే పొరపాటున ఆ సిలిండర్లు లీకైతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయి. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


భారీ వర్షాల కారణంగా జునాగఢ్‌లో దిగ్ర్భాంతికర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వరద ప్రవాహంలో పశువులు, పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పాల్ఘర్, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పక్కనే మహారాష్ట్ర కూడా వరదలతో అల్లాడిపోతుంది. మరోవైపు ప్రభుత్వం సహాయక చర్యలను కూడా చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవరసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని తెలిపింది.

Updated Date - 2023-07-24T16:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising