ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PAN Card: పాన్‌కార్డు ఉందా..? శుక్రవారం లోగా ఈ ఒక్క పని చేయకపోతే.. మీ పాన్ కార్డ్ ఇకపై పనిచేయదు..!

ABN, First Publish Date - 2023-06-28T19:09:06+05:30

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు పాన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయకపోతే.. తర్వాత ట్యాక్స్ పేయర్లకు ఆదాయపు పన్ను రీఫండ్ నిలిపేయనున్నారు. అలాగే టీసీఎస్, టీడీఎస్‌కు అధిక ఛార్జీలు వసూలు చేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 30వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు సబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆధార్ కార్డుతో పాన్‌ కార్డు లింక్ చేయడాన్ని (PAN and Aadhaar Link) ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ తప్పనిసరి చేసింది. ఇందుకోసం మార్చి 31 చివరి తేదీగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడుపు తేదీని జూన్ 30వరకు పొడిగించారు. ఈ గడువు కూడా దాటిపోతే రూ.1,000 అపరాధ రుసుముతో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే పాన్ కార్డులు ఇకపై పని చేయవని ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) స్పష్టం చేసింది. 2023 ఫిబ్రవరి నాటికి 13 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఆధార్‌కి లింక్ చేసుకోకపోవడం గమనార్హం. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే.. ఈ కింది విధంగా చేయాల్సి ఉంటుంది...

  • ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి (Income Tax Official Website) వెళ్లి ‘‘లింక్ ఆధార్’’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • అందులో మీ పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

  • ‘‘ఈ-పే ట్యాక్స్ ద్వారా పే కంటిన్యూ’’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • పాన్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసుకోవాలి.

  • అనంతరం ఈ-పే ట్యాక్స్ పేజీలోకి వెళ్తుంది.

  • AY 2024-25ని ఎంచుకోవచ్చు. పేమెంట్ మోడ్‌ను ‘‘Other Receipts (500)’’ ఆప్షన్ ఎంచుకుని.. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • అప్లికేబుల్ అమౌంట్ 'Others' సెక్షన్‌ కింద ఆటోమేటిక్‌గా చూపిస్తుంది.

  • ఇక్కడ పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని ఉపయోగించి మీ ఆధార్ నంబర్‌ను మీ పాన్‌కి లింక్ చేయడానికి కొనసాగించాలి.

  • ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించి మీ పాన్-ఆధార్ లింకింగ్ స్టాటస్‌ను చెక్ చేయవచ్చు.

  • ఎడమ వైపు ఉన్న ‘‘క్విక్ లింక్స్’’ క్లిక్ చేసి, ‘‘లింక్ ఆధార్ స్థితి’’ని ఎంచుకోవాలి.

  • మీ పాన్, ఆధార్ నంబర్లను నమోదు చేసి, ‘‘లింక్ ఆధార్ స్టేటస్‌’’పై క్లిక్ చేయాలి.

  • చివరగా ఆధార్, పాన్ లింక్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Updated Date - 2023-06-28T19:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising