ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Railway: రైలు ప్రయాణీకులకు బంపరాఫర్.. చేతిలో డబ్బుల్లేకున్నా ట్రైన్‌లో జర్నీ చేయొచ్చు.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-05-17T16:06:22+05:30

ఒక్కోసారి సడన్‌గా రైలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎవరిని అడిగినా దొరకపోవడంతో నిరుత్సాహ పడిపోతుంటారు.

train passengers
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కోసారి సడన్‌గా రైలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎవరిని అడిగినా దొరకపోవడంతో నిరుత్సాహ పడిపోతుంటారు. ఎలా అంటూ కంగారు పడుతుంటారు. అయితే ఇకపై అలాంటి ఆందోళన అక్కర్లేదు. చేతిలో డబ్బులు లేకపోయినా హాయ్‌గా ప్రయాణం చేయొచ్చు. అందుకు రైల్వే ప్రయాణీకులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అందేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఆన్‌లైన్ సేవలను ప్రయాణికులకు అందించడం కోసం ఐఆర్‌సీటీసీ క్యాష్‌ఈ, పేటీఎం, ఈపేలేటర్‌తో చేతులు కలిపింది. క్యాష్‌ఈ ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌’ పేరిట ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. పేటీఎం.. పోస్ట్‌పెయిడ్‌ కింద ఈ వెసులుబాటును అందుబాటులో ఉంచింది.

పేటీఎం తమ యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్‌ సర్వీసులను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం తమ యూజర్లకు 60 వేల వరకు రుణంగా ఇస్తోంది. బిల్లింగ్‌ సైకిల్‌ ముగిసేలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. కావాలంటే దీన్ని ఈఎంఐగా కూడా మార్చుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని ఐఆర్‌సీటీసీ (IRCTC) లో ట్రైన్‌ టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ (Indian Railway) చేసుకోవాలంటే ఇలా చేయండి. బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం సహా ఇతర ప్రయాణ వివరాలు ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత బుక్‌ టికెట్‌పై క్లిక్‌ చేయాలి. పేమెంట్‌ సెక్షన్‌లో పే లేటర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను ఎంపిక చేసుకోవాలి. అటు తర్వాత పేటీఎం లాగిన్‌ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్‌ చేయడంతో టికెట్‌ బుకింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక క్యాష్‌ఈ ద్వారా ఇలా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ రైల్‌ కనెక్ట్‌ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రయాణ వివరాలను ఎంటర్‌ చేసి బుక్‌ టికెట్‌ఫై క్లిక్‌ చేయాలి. పేమెంట్‌ ఆప్షన్లలో ‘ట్రావెల్‌ నౌ పే లేటర్‌’ను ఎంచుకోవాలి. టీఎన్‌పీఎల్‌ అందిస్తున్న వాటి నుంచి క్యాష్‌ఈని ఎంపిక చేసుకోవాలి. టికెట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది. డబ్బును ఈఎంఐల కింద మూడు లేదా ఆరు నెలల పాటు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఈపేలేటర్‌ అనే ఫిన్‌టెక్‌ సంస్థ సైతం ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. 14 రోజుల్లోగా టికెట్‌ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే 36 శాతం వడ్డీ పడుతుంది.

Updated Date - 2023-05-17T16:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising