Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నారా..?

ABN , First Publish Date - 2023-02-03T15:13:45+05:30 IST

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోగా మారిన వ్యకి శివ కార్తికేయన్(Sivakarthikeyan). ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘యాక్షన్ డాన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నటుడు సౌత్‌లోని స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నారా..?

యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోగా మారిన వ్యకి శివ కార్తికేయన్ (Sivakarthikeyan). ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘యాక్షన్ డాన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ నటుడు సౌత్‌లోని స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర బృందం నుంచి త్వరలోనే రానున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.

‘గజిని’, ‘తుపాకీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు ఏఆర్. మురగదాస్ ‘(AR Murugadoss). ఈ విభిన్న దర్శకుడు శివ కార్తికేయన్‌తో సినిమా చేయనున్నట్టు ప్రచారం జరగుతుంది. తెలుగు నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మురగదాస్ గతంలో శింబుతో సూపర్ హీరో చిత్రాన్ని చేయనున్నారని రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు మాత్రం ఆగిపోయింది. మురగదాస్ అదే కథతో శివ కార్తికేయన్‌‌తో సినిమా చేస్తారా.. మరేదైనా కొత్త స్టోరీతో చిత్రం పట్టాలెక్కుతుందా అనేది తెలియాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సిందే. ఈ ప్రాజెక్టు 2023 డిసెంబర్‌లో పట్టాలెక్కే అవకాశం ఉంది. శివ కార్తికేయన్ ప్రస్తుతం ‘మావీరన్’ (Maaveeran) లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌లోను ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు.

Updated Date - 2023-02-03T15:16:46+05:30 IST