ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కరెంట్ ఆఫీసు ముందుకు వచ్చిందో ట్రాక్టర్.. తాళ్లతో కట్టి మరీ ఓ మొసలిని దించగానే అంతా షాక్.. అసలు కథేంటో తెలిసి..!

ABN, First Publish Date - 2023-10-25T16:08:37+05:30

అదో విద్యుత్ కార్యాలయం. అధికారులు, సిబ్బంది ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు. ఇంతలో కరెంట్ ఆఫీసు ముందుకు ఓ ట్రాక్టర్ వచ్చి ఆగింది. ఏం జరుగుతుందా అని చూసే లోపే ట్రాక్టర్ ట్రాలీ నుంచి ఓ పెద్ద మొసలిని కిందకు దింపారు. దీంతో అప్పటిదాకా...

అదో విద్యుత్ కార్యాలయం. అధికారులు, సిబ్బంది ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్నారు. ఇంతలో కరెంట్ ఆఫీసు ముందుకు ఓ ట్రాక్టర్ వచ్చి ఆగింది. ఏం జరుగుతుందా అని చూసే లోపే ట్రాక్టర్ ట్రాలీ నుంచి ఓ పెద్ద మొసలిని కిందకు దింపారు. దీంతో అప్పటిదాకా పనుల్లో బిజీగా ఉన్న వారంతా మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

కర్నాటకలోని (Karnataka) హుబ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేవలం 8నుంచి 9గంటలు మాత్రమే కరెంట్ (Electricity) ఇస్తోంది. అది కూడా రాత్రి వేళ విడతల వారీగా ఇస్తుండడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా చాలా పంటలు ఎండిపోయాయి. దీనికితోడు రాత్రి వేళల్లో రైతులు పొలానికి వెళ్లిన సమయంలో వివిధ రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా విషసర్పాల భయంతో పాటూ అప్పుడప్పుడూ మొసళ్లు కూడా తారసపడుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.

Lover's video: ఇదెక్కడి ప్రేమరా బాబోయ్..! ప్రియురాలి నోట్లో పాలు పోసి మరీ.. ఇతడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ఈ క్రమంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 19న కొందరు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ఉన్నట్టుండి ఓ మొసలి (crocodile) అక్కడికి వచ్చింది. అయితే రైతులు దాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పొలంలోకి మొసలి వచ్చిందన్న సమాచారంతో చుట్టుపక్కల వారంతా అక్కడ గుమికూడారు. అప్పటికే కరెంట్ కోతలతో ఆగ్రహంతో ఉన్న రైతులు.. ఈ ఘటనతో మరింత ఆగ్రహానికి గురయ్యారు. తమ సమస్యలు అధికారులకు అర్థం కావాలనే ఉద్దేశంతో మొసలిని బంధించి ట్రాక్టర్‌లో నేరుగా విద్యుత్ కార్యాలయానికి (Electricity Office) తీసుకెళ్లారు.

Skydiving Video: స్కైడైవింగ్ సమయంలో షాకింగ్ అనుభవం.. తీరా విమానంలోంచి దూకుతుండగా ఊహించని విధంగా..

అప్పటి వరకూ కార్యాలయంలో వివిధ రకాల పనుల్లో బిజీబిజీగా ఉన్న అధికారులు, సిబ్బంది... మొసలిని చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొసలిని ఆఫీసు వద్దకు తీసుకెళ్లిన రైతులు.. తమకు రాత్రి పూట కాకుండా పగటి పూట నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకున్నారు. చివరకు ఉన్నతాధికారులు కలుగజేసుకుని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అధికారులు అర్థమయ్యేలా బాగా చెప్పారు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా..? ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. తలుపులను ఓ వ్యక్తి బలవంతంగా తీసి..!

Updated Date - 2023-10-25T16:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising