ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chicken Biryani: చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే.. పీస్‌లకు బదులుగా కోడి తలను చూసి అవాక్కైన మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

ABN, First Publish Date - 2023-11-07T12:21:13+05:30

చికెన్ బిర్యానీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ పేరు వింటేనే చాలు నోటిలో నీళ్లు తిరుగుతాయి.

Chicken Biryani: చికెన్ బిర్యానీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆ పేరు వింటేనే చాలు నోటిలో నీళ్లు తిరుగుతాయి. కానీ, ఇలా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీ విషయంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని పొరపాట్ల తాలూకు వార్తలు వామ్మో.. అసలు బిర్యానీ తినాలా? వద్దా? అని ఒకసారి ఆలోచించుకునేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా కేరళలో చోటు చేసుకుంది. ఓ మహిళ ఎంతో ఇష్టంగా చికెన్ బిర్యానీ (Chicken Biryani) తిందామని ఆర్డర్ చేసింది. తీరా.. పార్శిల్ చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే.. బిర్యానీలో వచ్చిన కోడి తలను చూసి నిర్ఘాంతపోవడం ఆమె వంతైంది.

WhatsApp groups: ఎవరు పడితే వాళ్లు వాట్సప్ గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా..? ఈ ట్రిక్‌ను కనుక వాడితే..!

వివరాల్లోకి వెళ్తే.. తిరూర్ పరిధిలోని ఈఝూర్ ప్రాంతానికి చెందిన ప్రతిభ అనే మహిళ శనివారం ముథూర్‌లోని పోరోట్ట స్టాల్ నుంచి నాలుగు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి పార్శిల్ వచ్చింది. ఇక ఒక పట్టుపడదామని ప్రతిభ ఇంట్లోని వారందరూ రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఓ పొట్లం ఓపెన్ చేసింది. అంతే.. అందులో ఆమెకు కోడి తల కనిపించింది. అది చూసి అవాక్కైన ఆమె వెంటనే ఈ విషయంపై తిరుర్ హెల్త్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ సెఫ్టీ అధికారుకు ఫిర్యాదు చేసింది. ప్రతిభ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సెఫ్టీ అధికారులు ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆమెకు చికెన్ బిర్యానీ పార్శిల్ పంపించిన పోరోట్ట స్టాల్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆ ఫుడ్ స్టాల్‌పై కేసు నమోదు చేసి, సీజ్ చేశారు.

Viral Video: చేత్తో ఇటుకను పట్టుకుని మరీ భార్యాభర్తల మధ్య బిగ్ ఫైటింగ్.. వీడియోను చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు..!

Updated Date - 2023-11-07T12:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising