ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lift Collapse Video: సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్ దృశ్యం.. 10వ అంతస్తు నుంచి కుప్పకూలిపోయిన లిఫ్ట్..!

ABN, First Publish Date - 2023-08-01T19:14:02+05:30

పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సమయంలో కొంతమంది అదృష్టవంతులు చిన్న గాయం కూడా కాకుండా బయటపడుతుంటారు. ఇలాంటప్పుడే.. వీళ్లకు ఇంకా భూమ్మీద నూకలు మిగిలున్నాయ్.. అని అనిపిస్తుంటుంది. ఘోర ప్రమాదాల నుంచి వెంట్రుకవాసిలో బయటపడ్డ ఎంతో మందిని తరచూ..

పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిన సమయంలో కొంతమంది అదృష్టవంతులు చిన్న గాయం కూడా కాకుండా బయటపడుతుంటారు. ఇలాంటప్పుడే.. వీళ్లకు ఇంకా భూమ్మీద నూకలు మిగిలున్నాయ్.. అని అనిపిస్తుంటుంది. ఘోర ప్రమాదాల నుంచి వెంట్రుకవాసిలో బయటపడ్డ ఎంతో మందిని తరచూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పదో అంతస్తు నుంచి కుప్పకూలిపోయిన లిఫ్ట్ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ‘‘అమ్మ బాబోయ్.. లిఫ్ట్ ఎక్కాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని (Maharashtra) పూణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు చిన్నారులు లిఫ్ట్‌లో (Apartment) పదో అంతస్తు పైకి వెళ్తారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ వారి అంతస్తు రాగానే దిగిపోతారు. తర్వాత లిఫ్ట్ డోర్లు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. అయితే తర్వాత కొద్ది సేపటికే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. లిఫ్ట్ అమాంతం పదో అంతస్తు నుంచి ధమేల్‌మని (lift collapse) కిందపడిపోతుంది. దీంతో లిఫ్ట్ మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది. ఈ దృశ్యాలన్నీ లిఫ్ట్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Viral Video: సముద్రంలో స్నానాలు చేస్తోంటే సడన్‌గా షాకింగ్ ఘటన.. ఉలిక్కిపడిన జనం.. ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్తే..!

ప్రమాదానికి కాస్త ముందు పిల్లలు ఇద్దరూ దిగిపోవడం, తర్వాత లిఫ్ట్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను.. లిఫ్ట్ మె8యింటెనెన్స్, బిల్డర్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘‘CRIME CONTROL REFORM ORGANIZATION (CRO) ALL INDIA’’.. అనే ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లలను ఆ దేవుడే కాపాడాడు’’.. అని కొందరు, ‘‘కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి’’.. అని మరికొందరు, ‘‘డబ్బుల కోసం కక్కుర్తి పడి నాసిరకం పనులు చేస్తున్నారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇదేం పనయ్యా బాబూ.. ఈ స్కూటీ హారన్ మోగించగానే వస్తున్న శబ్దాలు విని.. పడీపడీ నవ్వుతున్న జనం..!

Updated Date - 2023-08-01T19:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising