ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Woman IAS Story: డబ్బులు లేకపోతే ఫ్రీగా దోశలు ఇచ్చిన హోటల్‌కే కలెక్టర్‌ అయ్యాక తిరిగొచ్చారు.. వార్త వైరల్‌ అవడంతో ఆమె రెస్పాన్స్ ఇదీ..!

ABN, First Publish Date - 2023-03-11T21:18:27+05:30

ఆమె ప్రస్తుతం కలెక్టర్. అయితే ఒకప్పుడు డబ్బులు లేకపోతే.. ఓ హోటల్ యజమాని ఫ్రీగా దోశలు పెట్టాడు. అంత పేదరికం నుంచి వచ్చిన యువతి.. క్రమ క్రమంగా పట్టుదలతో కష్టపడి చదివి చివరకు కలెక్టర్ అయింది. విచిత్రంగా అదే జిల్లాకు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆమె ప్రస్తుతం కలెక్టర్. అయితే ఒకప్పుడు డబ్బులు లేకపోతే.. ఓ హోటల్ యజమాని ఫ్రీగా దోశలు పెట్టాడు. అంత పేదరికం నుంచి వచ్చిన యువతి.. క్రమ క్రమంగా పట్టుదలతో కష్టపడి చదివి చివరకు కలెక్టర్ అయింది. విచిత్రంగా అదే జిల్లాకు అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు తనకు ఫ్రీగా దొశలు పెట్టిన హోటల్ యజమానిని గుర్తు పెట్టుకుని మరీ.. ఆ హోటల్‌కి వెళ్లి అభినందించారు. ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై సదరు కలెక్టర్ ఏమంటున్నారంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) కేడర్‌కు చెందిన 2007బ్యాచ్ ఐఏఎస్ అధికారి స్వాతి మీనా నాయక్ (IAS officer Swati Meena Naik).. గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘‘స్వాతి మీనాది చాలా పేద కుటుంబం. కనీసం తినడానికి కూడా డబ్బులు లేనంత స్థితిలో వారి కుటంబం ఉండేది. ఈ క్రమంలో స్వాతి మీనా పదో తరగతి పరీక్షలకు సిద్ధమైంది. పరీక్షల్లో జిల్లా ఫస్ట్ వస్తే.. పెద్ద హోటల్లో ఖరీదైన దోశలు తినిపిస్తా.. అని ఆమె తండ్రి మాట ఇచ్చాడు. అన్నట్లుగానే స్వాతి మీనా పదో తరగతిలో జిల్లా ఫస్ట్ వచ్చింది. దీంతో తండ్రి తన కూతురును హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే అతడి వద్ద కేవలం ఒక దోశకు మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఇదే విషయాన్ని వెయిటర్‌కు చెప్పడంతో అతడి కరిగిపోయాడు. హోటల్ యజమానికి చెప్పడంతో అతడు కూడా చలించిపోయాడు. చివరకు వారికి ఓ టేబుల్ కేటాయించి, మంచి మంచి వంటకాలను వడ్డించాడు. తర్వాత కాలంలో స్వాతి మీనా కలెక్టర్ స్థాయికి వెళ్లి.. అదే జిల్లాకు అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. చిన్నతనంలో తనకు అన్నం పెట్టిన హోటల్‌కి వెళ్లి పాత యజమానిని సత్కరించారు’’.. ఇది సోషల్ మీడియాలో ఆమె గురించి జరిగే చర్చ.

Fridge Cooling Problem: ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అస్సలు కూల్ అవడం లేదా..? ఈ సమస్యకు పరిష్కారమిదే..!

అయితే దీనిపై తాజాగా స్వాతి మీనా నాయక్ స్పందించారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ (Facebook account) ద్వారా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపై వచ్చేవన్నీ అబద్ధాలని తేల్చి చెప్పింది. తమది ముందు నుంచి స్థిరపడిన కుటుంబం అని గుర్తు చేశారు. తాను రాజస్థాన్‌లోని (Rajasthan) అజ్మీర్‌లో జన్మించానని, స్థానికంగా ఉన్న ప్రతిష్టాత్మకమైన సోఫియా స్కూల్, సోఫియా కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు తెలిపారు. తన తండ్రి రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అని, తన తల్లి వ్యాపారవేత్త అని పేర్కొన్నారు. దీంతో తనకు చిన్నప్పటి నుంచీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవలేదని చెప్పారు. తన భర్త తేజస్వి నాయక్ కూడా ఐఏఎస్ అధికారి అని, ఇటీవల ఆయన డిప్యుటేషన్‌పై ఢిల్లీ (Delhi) వెళ్లినట్లు పేర్కొన్నారు. తన పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఇలాంటి కట్టు కథలు అల్లారని స్వాతి మీనా వివరణ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్లూ ఆమె నేపథ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు (Viral news) పుకార్లే అని తేలిపోయింది.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T21:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising