Viral News: ఈ రైతు తెలివికి సెల్యూట్ కొట్టాల్సిందే!.. టమాటా పంటను రక్షించుకోవడానికి ఏం చేశాడో చూడండి..
ABN, First Publish Date - 2023-08-08T15:17:20+05:30
సాధారణంగా సీసీ కెమెరాలను(CCTV cameras) మనం ఖరీదైన వస్తువులను అమ్మే దుకాణాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఇతరత్రా ప్రదేశాల్లో కూడా ముందు జాగ్రత్తగా భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఓ రైతు తన పంటను రక్షించుకోవడానికి పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సాధారణంగా సీసీ కెమెరాలను(CCTV cameras) మనం ఖరీదైన వస్తువులను అమ్మే దుకాణాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఇతరత్రా ప్రదేశాల్లో కూడా ముందు జాగ్రత్తగా భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఓ రైతు తన పంటను రక్షించుకోవడానికి పొలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకోసం సదరు రైతు ఏకంగా 22 వేల రూపాయలను ఖర్చు చేశాడు. దీంతో దొంగలు ఆ పంట వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా లేకుండాపోయింది. ఇంతలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు కదా.. అసలు ఆ రైతు ఏం పంట పడిస్తున్నాడు అనుకుంటున్నారా!.. ఇంకేం పంట టమాటానే. అవును ఈ రోజుల్లో టమాటాలకు మించి ఖరీదైనవి ఏం ఉన్నాయి. పైగా ఇటీవల టమాటాల దొంగతనాలకు సంబంధించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సదరు రైతు ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. బహుషా మన దేశంలో ఓ పంటను రక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి కావొచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో గల వాలూజ్ ప్రాంతంలో(Maharashtra's Chhatrapati Sambhajinagar) శరద్ రావతే అనే రైతు టమాటా పంట సాగు(tomato crop) చేస్తున్నాడు. దేశంలో టమాటాల ధరలు ఆకాశన్నింటిన నేపథ్యంలో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా శరద్ రావతే(Sharad Rawate) తాను టమాటా పండించే పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఇందుకోసం రూ.22 వేలు ఖర్చు అయినట్లు రైతు శరద్ రావతే తెలిపాడు. మొత్తానికి శరద్ రావతే చేసిన వినూత్న ఆలోచనతో దొంగలు అతని పంట వైపునకు కన్నెత్తి చూడకుండా అయిందనే చెప్పుకోవాలి. దీంతో సదరు రైతుపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతుల్లోనే ఉత్తమ రైతు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మహారాష్ట్రలో టమాటాల సగటు ధర రూ.160గా ఉంది. మరోవైపు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల టమాటాలను దొంగిలించిన ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన టమాటాల ట్రక్కు సోమవారం అదృశ్యమైందని పోలీసులు తెలిపారు. ఇది దొంగల పనే అయి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో జార్ఖండ్‌లో గల కూరగాయల మార్కెట్‌లోని ఓ దుకాణంలో 40 కిలోల టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
కాగా నెల రోజులుగా దేశ వ్యాప్తంగా టమాటాల ధరలు(Tomato price rise) మండిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులకు టమాటాలు బంగారంలా కనిపిస్తున్నాయి. టమాటాలను కొనలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటాలు రూ.150కి పైగానే ధర పలుకుతున్నాయి. ఒకానొక దశలో పలు ప్రాంతాల్లో కిలో టమాటాలు ఏకంగా రూ.250 వరకు పలికాయి. అయితే పెరిగిన ధరలతో కొనుగోలుదారులు అల్లాడిపోతున్నప్పటికీ పలువురు రైతులు, విక్రయదారులు మాత్రం భారీగా లాభపడుతున్నారు. లక్షల రూపాయలు చూడని వారు సైతం టమాటాల ద్వారా కోటీశ్వరులుగా మారిపోయారు.
Updated Date - 2023-08-08T15:35:22+05:30 IST