Marriage: పాపం.. ఇష్టపడి మరీ అతడిని రెండో పెళ్లి చేసుకుంటే.. ఈ మహిళకు ఇలా జరిగిందేంటి..? రూ.45 లక్షలతో..!
ABN, First Publish Date - 2023-09-14T18:52:36+05:30
సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు.. చివరకు ఎటు దారితీస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ పరిచయాలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటుంటారు.మహిళల విషయంలో అయితే ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా...
సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు.. చివరకు ఎటు దారితీస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ పరిచయాలను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటుంటారు.మహిళల విషయంలో అయితే ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తాజాగా, ముంబైలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని ఇష్టపడి మరీ వివాహం చేసుకుంది. అయితే చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
నవీ ముంబై (Navi Mumbai) సన్‌పడ ప్రాంతానికి చెందిన 56ఏళ్ల మహిళ (woman) తన కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. ఈమె 2020లో భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం కొడుకుతో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా, ఇటీవల ఈమెకు ముంబైలోని కఫ్ పరేడ్‌కు చెందిన 42ఏళ్ల వ్యక్తి ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయమయ్యాడు. తరచూ ఇద్దరూ మేసేజ్‌లు చేసుకునే క్రమంలో బాగా దగ్గరయ్యారు. తర్వాత ఫోన్ నంబర్లు కూడా మార్చుకున్నారు. రోజూ ఫోన్లలో మాట్లాడుకుంటూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఈ క్రమంలో తరచూ అతను ఆమె ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు.
Shocking: ఈ చేపలను తిని 32 ఏళ్ల మహిళ మృతి.. మరో 12 మంది పరిస్థితి విషమం.. ఇంతకీ ఇవేం చేపలంటే..!
అనుకున్నట్లుగానే ఇటీవలే ఇద్దరూ వివాహం (marriage) కూడా చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత నుంచి భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల ఈ వేధింపులు (Harassment) ఇంకా ఎక్కువయ్యాయి. అంతటితో ఆగని అతను ఇటీవల ఓ రోజు ఇంట్లో ఉన్న రూ.45లక్షల విలువైన నగలు, నగదును తీసుకున్నాడు. దీనిపై ఆమె ప్రశ్నించచడంతో.. కొడుకును చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-14T18:52:36+05:30 IST