ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారా..? ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు.. తలుపులను ఓ వ్యక్తి బలవంతంగా తీసి..!

ABN, First Publish Date - 2023-10-25T15:19:11+05:30

ప్రయాణ సమయాల్లో తొందరపాటు కారణంగా కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో కొందరు, దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోతోందనే కంగారులో మరికొందరు ఏవేవో సాహసాలు చేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి...

ప్రయాణ సమయాల్లో తొందరపాటు కారణంగా కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో కొందరు, దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోతోందనే కంగారులో మరికొందరు ఏవేవో సాహసాలు చేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తాను దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోతోందనే కంగారులో చివరకు డోరు తెరిచాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ఏడాది క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మెట్రో రైల్లో (Metro train) ప్రయాణిస్తుంటాడు. అయితే తాను దిగాల్సిన స్టేషన్ వచ్చినా అతను ఏదో ఏమరపాటులో చూసుకోడు. దీంతో రైలు యథావిధిగా కాసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతుంది. అయితే తాను దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోతోందనే విషయం రైలు కదిలిన తర్వాత చూసుకున్న అతను తెంగ కంగారుపడిపోతాడు. పది నిముషాలు ఆగితే తర్వాత స్టేషన్ వస్తుందని తెలిసినా.. అదే స్టేషన్‌లోని చివరకు డోరు వద్దకు వెళ్తాడు. అయితే అప్పటికే డోర్లు మూసుకుపోయి ఉంటాయి. అయినా అతను (man tried to open the train door) వాటిని తీసేందుకు ప్రయత్నిస్తాడు.

Lover's video: ఇదెక్కడి ప్రేమరా బాబోయ్..! ప్రియురాలి నోట్లో పాలు పోసి మరీ.. ఇతడు చేసిన పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

అయినా బోగీ డోర్లు తెరచుకోవు. దీంతో అతను మరింత గట్టిగా ప్రయత్నిస్తాడు. చివరకు ఎలాగోలా డోర్లు తీసి, స్టేషన్ ప్లాట్‌ఫామ్ పైకి దూకేస్తాడు. అయితే అప్పటికే రైలు వేగంగా వెళ్తుండడంతో అతను ఒక్కసారిగా అదుపుతప్పి ధమేల్‌మని కిందపడిపోతాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనను రైల్లో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అని కొందరు, ‘‘పది నిముషాల కోసం ప్రాణాలు తీసుకోవద్దు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి తప్పులు ఎవరూ చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

Viral Video: పెద్ద జంతువును మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. కంచె దాటుతుండగా ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-25T15:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising