ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పాము ఎదురుగా.. అచ్చం కోబ్రాలాగే బుసకొట్టిన యువకుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN, Publish Date - Dec 29 , 2023 | 03:41 PM

పామును చూడగానే పరుగులు పెట్టేవారు కొందరైతే.. మరికొందరు అందరి ముందూ హీరోల తరహాలో బిల్డప్ ఇస్తూ వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు మాత్రం అదృష్టం బాగుండి..

పామును చూడగానే పరుగులు పెట్టేవారు కొందరైతే.. మరికొందరు అందరి ముందూ హీరోల తరహాలో బిల్డప్ ఇస్తూ వాటితో పరాచకాలు ఆడుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చాలా చూశాం. అయితే కొన్నిసార్లు మాత్రం అదృష్టం బాగుండి.. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు నాగుపాము ఎదుటే.. పాము లాగా బుసకొడుతూ పిచ్చి చేష్టలు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఉన్న నాగుపామును పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నిస్తాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే దాని వద్దకు వెళ్తాడు. పట్టుకునే ముందు కాసేపు పాముతో తమాషా చేస్తాడు. పడగ విప్పి ఉన్న పామును మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. దాని తోకను, తలపై తాకుతూ తమాషా చేస్తాడు. మధ్య మధ్యలో పాములాగే దానిపై బుసకొట్టినట్లు నటిస్తూ పాముకు కోపం తెప్పిస్తాడు. అతడిని (snake tried to bite man) కాటేసేందుకు పాము పలుమార్లు ప్రయత్నిస్తుంది.

Viral Video: కారు చోరీ కాకుండా ఇతడు తీసుకున్న ముందు జాగ్రత్తలు చూస్తే.. నోరెళ్లబెడతారు..

అయినా అతను మాత్రం దాని కాటు నుంచి తప్పించుకుంటూ పాముతో ఆటలు ఆడుతుంటాడు. ఓ సమయంలో పాము అతన్ని దాదాపు కాటేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అదృష్టం కొద్దీ తృటిలో తప్పించుకుంటాడు. అయినా అతను మాత్రం భయపడకుండా పామును ఆటపట్టిస్తూనే ఉంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘మూగజీవులను హింసించడం నేరం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి పీటలపైనే వరుడికి షాకిచ్చిన వధువు.. సరదాగా మొదలై చివరకు ఏమైందో చూడండి..

Updated Date - Dec 29 , 2023 | 03:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising