Soldier Wife: ఓ భారతీయ సైనికుడి భార్యకు కలలో కూడా ఊహించని కష్టం.. 20 రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా..
ABN, First Publish Date - 2023-07-14T19:35:45+05:30
దేశ సేవకు అంకితమైన కొడుకును చూసి తల్లి ఎంతో సంతోషించింది. మరోవైపు.. తనకు, పిల్లలకు దూరంగా ఉన్నా కూడా దేశం కోసం తన భర్త కష్టపడడం చూసి భార్య కూడా గర్వంగా ఫీలయ్యేది. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. అంతా ..
దేశ సేవకు అంకితమైన కొడుకును చూసి తల్లి ఎంతో సంతోషించింది. మరోవైపు.. తనకు, పిల్లలకు దూరంగా ఉన్నా కూడా దేశం కోసం తన భర్త కష్టపడడం చూసి భార్య కూడా గర్వంగా ఫీలయ్యేది. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. అంతా సవ్యంగా సాగుతుంది అని అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కుటుంబానికి ప్రస్తుతం కలలో కూడా ఊహించని కష్టం వచ్చింది. ఆర్మీ జవాను భార్య 20 రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
హర్యానాలోని (Haryana) చర్ఖీ దాద్రీలోని రావల్ది గ్రామానికి చెందిన 34 ఏళ్ల యుధ్వీర్ సింగ్ అనే యువకుడు అర్మీలో (Indian Army) పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇతను అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి భార్య సోనాల్, రెండేళ్ల కుమారుడు, 8ఏళ్ల కుమార్తె ఉన్నారు. వీరు ప్రస్తుతం యుధ్వీర్ సింగ్ తల్లి ప్రేమ్ దేవి వద్ద ఉంటున్నారు. యధ్వీర్ అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్తుండేవాడు. అయితే ఇటీవల ఊహించని ఘటన చోటు చేసుకుంది. 20 రోజుల క్రితం యుధ్వీర్ ఉన్నట్టుండి (soldier missing) అదృశ్యమయ్యాడు. విధులకు హాజరవకపోవడంతో అధికారులు ఇంటికి సమాచారం అందించారు. భర్త అదృశ్యమయ్యాడనే వార్త విన్న భార్యతో పాటూ కుటుంబ సభ్యులు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: ఈ బుడ్డోడు భలే తెలివైనోడు.. వెనుక కూర్చున్న తమ్ముడు పొరపాటున కింద పడిపోతాడేమోనని..!
ఈ విషయం తెలుసుకున్న యుధ్వీర్ బంధువులు, స్నేహితులు, సన్నిహితులంతా అతడి గ్రామానికి చేరుకుంటున్నారు. రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ తెలియకపోవడంతో యుధ్వీర్ తల్లి, భార్య బోరున విలపిస్తున్నారు. యుధ్వీర్ క్షేమంగా తిరిగిరావాలని అన్ని పూజలు చేస్తున్నారు. యుధ్వీర్ భార్య మాట్లాడుతూ 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను క్షేమంగా తీసుకురావాలంటూ ప్రధాని, రక్షణ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు యుధ్వీర్ సింగ్ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. ఆర్మీ ఉన్నతాధికారులు స్పందించి.. యుధ్వీర్ సింగ్ ఆచూకీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-14T19:35:45+05:30 IST