ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: యాపిల్స్ ఇచ్చుకో.. ఐఫోన్ తీసుకో.. మహిళకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కోతి..

ABN, First Publish Date - 2023-10-19T15:23:21+05:30

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కోతులు పండ్లు, పలహారాల కోసం దాడులు చేస్తే.. మరికొన్ని కోతులు ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ పడేస్తాయో తెలీక చాలా మంది వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తుంటాం. వస్తువులు ఒక్కసారి..

కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని కోతులు పండ్లు, పలహారాల కోసం దాడులు చేస్తే.. మరికొన్ని కోతులు ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. వాటిని ఎప్పుడు ఎక్కడ పడేస్తాయో తెలీక చాలా మంది వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తుంటాం. వస్తువులు ఒక్కసారి వాటి చేతిలోకి వెళ్లాయంటే ఇక దాదాపు తిరిగి దక్కే అవకాశం ఉండదు. అయితే కొన్నిసార్లు ఇదే కోతులు ఊహించని ట్విస్ట్‌లు ఇస్తుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. కోతికి యాపిల్ పండ్లను పంచడంతో తిరిగి కోతి ఆమెకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళ అక్కడి అందాలను వీక్షిస్తూ సరదగా గడుపుతూ ఉంటుంది. ఈ సమయంలో ఓ కోతి (monkey) ఆమెకు సడన్ షాక్ ఇస్తుంది. ఆమె చేతిలోని ఐ ఫోన్‌ను (i phone) ఎత్తుకెళ్లుంది. దీంతో ఆమె కంగారుపడిపోతుంది. దగ్గరికి వెళ్తే ఎక్కడ కరుస్తుందో అనే భయంతో కోతి ఎదురుగా నిలబడి కొద్దిసేపు ఆలోచిస్తుంది. కోతి కూడా గోడపై కూర్చుని, ఫోన్‍‌ను గట్టిగా పట్టుకుని ‘‘లంచం ఇవ్వకపోతే.. నీ ఫోన్‌ను కొరికేస్తా’’.. అంటూ బెదిరించినట్లుగా నటిస్తుంది. దీంతో ఆమె వెంటనే ఐడియా సర్ జీ.. అని అనుకుంటూ బ్యాగులోంచి ఓ ప్యాకెట్ బయటికి తీసి కోతికి ఇవ్వబోతుంది.

Viral Video: కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. గంటన్నర పాటు కష్టపడి దాన్ని ఎలా బయటకు తీశారంటే..!

అయితే దానికి అది నచ్చలేదేమో.. ‘‘ఇది నేను తినను.. నాకు పండ్లు ఇస్తేనే ఐ ఫోన్ ఇస్తా.. లేదంటే కొరికేస్తా’’.. అంటూ ఫోన్‌ను మళ్లీ కొరకబోతుంది. దీంతో మహిళ చివరకు తన బ్యాగులోంచి ఓ యాపిల్‌ను తీసి కోతి ఇస్తుంది. మరోటి కావాలి అన్నట్లుగా కోతి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో మళ్లీ ఇంకో యాపిల్‌ను ఇస్తుంది. రెండు పండ్లను ఇవ్వగానే వెంటనే ఫోన్‌ను ఇచ్చేసి, పక్కకు వెళ్లి పండ్లను ఆరగిస్తుంది. ఈ ఘటనను చూసి పక్కన ఉన్న పర్యాటకులంతా నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ కోతి భలే ఫన్నీగా ఉందే’’.. అని కొందరు, ‘‘యాపిల్‌కు బదులుగా యాపిల్ ఫోన్.. సూపర్’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ కోతికి లంచాలకు అలవాటుపడింది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 24వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking: ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. లోపలి నుంచి తాళం పెట్టి ఉందని గుర్తించిన స్థానికులు.. పోలీసులు తలుపులను పగలగొట్టి చూస్తే..!

Updated Date - 2023-10-19T15:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising