BTech Student: పాపం.. ఈ బీటెక్ కుర్రాడు.. కాలేజీ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.. అతడి తల్లి చెప్పిన నిజాలేంటంటే..!
ABN, First Publish Date - 2023-07-21T21:47:41+05:30
ప్రేమలో విఫలమయ్యామని కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, ఉపాధ్యాయులు తిట్టారని ఇంకొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలను తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, బెంగళూరులో ఓ విద్యార్థి కాలేజీ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే...
ప్రేమలో విఫలమయ్యామని కొందరు, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మరికొందరు, ఉపాధ్యాయులు తిట్టారని ఇంకొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భాలను తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, బెంగళూరులో ఓ విద్యార్థి కాలేజీ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసు ప్రస్తుతం మిస్టరీగా మారింది. తమ కొడుకు చనిపోయే ముందు ఫోన్ చేశాడని, చనిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ ఆరోపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె చెప్పిన నిజాలేంటంటే..!
కర్నాటక (Karnataka) మంగళూరు బన్నెరఘట్ట రోడ్డు ప్రాంతానికి చెందిన ఆదిత్య (19) అనే విద్యార్థి బెంగళూరులోని (Bangalore) ఓ ప్రముఖ యూనివర్సిటీలో (University) కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జూలై 17 సోమవారం యూనివర్సిటీలో పరీక్షలు నిర్వహించారు. ఆదిత్య పరీక్ష రాస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆదిత్య వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్లు ఇన్విజిలేటర్ గుర్తించాడు. కాపీ కొట్టినట్లు అనుమానం రావడంతో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి బయటికి తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం.. తల్లిదండ్రులకు అప్పజెబుతామని అధ్యాపకులు చెప్పడంతో విద్యార్థి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మధ్యాహంనం 1గంట సమయంలో కళాశాల భవనంలోని 8వ అంతస్తు నుంచి దూకి (Student suicide) ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. పరీక్ష రోజు ఉదయం తమతో మాట్లాడిన కొడుకు అంతలోనే ఇలా విగతజీవిగా మారడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తాజాగా, ఆదిత్య మృతిపై అతడి తల్లి.. సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేసింది. తమ కొడుకు మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని చెప్పింది. తమ కొడుకు ఫోన్ ఆఫ్ చేసి, బ్యాగులో పెట్టుకుని ఉన్నా కావాలనే అవమానించారని తెలిపింది. ‘‘ఇలాంటి పని చేసే బదులు చనిపోవడమే మేలు’’.. అంటూ వేధించారని, అందుకే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటోంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ (Viral news) వైరల్ అవుతోంది. ఈ కేసును అధికారులు సీరియస్‌గా తీసుకుని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-21T21:47:41+05:30 IST