అమ్మాయి పెదవులపై వంద నోటును పెట్టి.. అతడు చేసిన నిర్వాకానికి.. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చిందంటే..
ABN, First Publish Date - 2023-02-07T15:26:18+05:30
ఓ బాలిక తన స్నేహితులతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. ఓ యువకుడు కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. మధ్యలో ఒక్కసారిగా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక పెదవులపై వంద రూపాయల నోటును పెట్టి అతడు చేసిన నిర్వాకంపై..
ఓ బాలిక తన స్నేహితులతో కలిసి మార్కెట్‌కు వెళ్లింది. ఓ యువకుడు కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. మధ్యలో ఒక్కసారిగా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక పెదవులపై వంద రూపాయల నోటును పెట్టి అతడు చేసిన నిర్వాకంపై స్థానికులంతా తీవ్రంగా మండిపడ్డారు. సుమారు ఐదేళ్ల క్రితం నమోదైన ఈ కేసుపై ముంబై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర (Maharashtra) ముంబై పరిధిలో 2017లో నమోదైన కేసులో ముంబైలోని ప్రత్యేక పోక్సో చట్టం కోర్టు (MUMBAI POCSO LAW COURT) తాజాగా తీర్పు వెలువరించింది. ముంబై పరిధికి చెందిన 16ఏళ్ల బాలిక (girl).. 2017 జూలై 13న తన పొరుగువారితో కలిసి మార్కెట్‌కి వెళ్లింది. ఇదే ప్రాంతానికి చెందిన 32ఏళ్ల వ్యక్తి ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. మధ్యలో ఒక్కసారిగా బాలికను పట్టుకుని అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. నువ్వంటే నాకు ఇష్టం.. అంటూ ఆమె పెదవులపై వంద రూపాయల నోటును (One hundred rupee note) పెట్టి దురుసుగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించాడు.
అక్కడ నుంచి ఇంటికి వచ్చిన బాలిక.. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి బోరున విలపించింది. తర్వాత ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ముంబై పోక్సో చట్టం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. నిందితుడి ఏడాది జైలు శిక్ష (One year imprisonment) విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితుడి తల్లి కేన్సర్ రోగి అని, ఇతడిపై కుటుంబం ఆధారపడి ఉన్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. అయినా నేర తీవ్రత దృష్ట్యా తగిన శిక్ష విధించడం న్యాయస్థానం విధి అని పేర్కొన్నారు.
Updated Date - 2023-02-07T15:27:15+05:30 IST