ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RRR: ‘నాటు నాటు’కి అరుదైన అవకాశం.. హీరోలు, దర్శకుడిని దాటేసి మరీ ఆస్కార్స్ స్టేజ్‌పై..

ABN, First Publish Date - 2023-03-01T10:32:29+05:30

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే.

RRR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న సంచలనాల గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదలై సంవత్సరం కావొస్తున్న ఏదో ఓ చోట ఈ చిత్రం పేరు వినిపిస్తూనే ఉంది. ఎంతో పాపులారిటీ ఉన్న హాలీవుడ్ దర్శకులు, రైటర్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి అయితే ఈ చిత్రానికి మించిన పాపులారిటీ వచ్చింది. ఈ పాట ఏకంగా సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డునే సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. 95వ అకాడమీ అవార్డులు (ఆస్కార్స్ 2023)కి సైతం ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో నామినేట్ అయ్యింది.

ఈ తరుణంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీంకి మరో అరుదైన ఘనత దక్కింది. ఎం.ఎం. కీరవాణీ సంగీత దర్శకత్వం అందించిన ‘నాటు నాటు’ సాంగ్‌ని సినిమాలో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన విషయం తెలిసిందే. మార్చి 12న జరగనున్న ఆస్కార్స్ 2023 స్టేజ్‌పై ఈ సింగర్స్ ఇద్దరూ ఈ పాటని పాడే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆస్కార్ యాజమాన్యం ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేసింది.

అందులో.. ‘‘95వ ఆస్కార్స్ స్టేజ్‌పై రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ్ ‘నాటు నాటు’ పాటని పాడనున్నారు’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో పలువురు సినీ లవర్స్ ‘ఆర్ఆర్ఆర్’ టీంని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘రాహుల్, భైరవ్ పాడాలి.. దానికి ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ వేయాలి. అది మేం చూడాలి’.. ‘భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినందుకు రాజమౌళి, కీరవాణికి ధన్యవాదాలు’ అని రాసుకొస్తున్నారు. అంతేకాకుండా.. పలువురు విదేశీ అభిమానులు సైతం ‘మాకు ఆ హీరోలతో కలసి స్టేజ్‌పై డ్యాన్స్ చేయాలని ఉంది. ఒక్క అవకాశం ప్లీజ్’ అంటూ కామెంట్స్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-01T10:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!