Viral Photo: ఎవరీ అమ్మాయి..? అంటూ అదే పనిగా వెతికిన నెటిజన్లు.. ఒకే ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసిన యువతి..!

ABN, First Publish Date - 2023-03-16T15:36:20+05:30

సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో కొన్నిసార్లు ఒకే ఒక్క వీడియో లేదా ఫొటోతో కొందరు ఉన్నట్టుండి సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. ఇంకొందరు వినూత్నమైన ఆలోచనలు, ఐడియాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇక యువతుల సంగతి..

Viral Photo: ఎవరీ అమ్మాయి..? అంటూ అదే పనిగా వెతికిన నెటిజన్లు.. ఒకే ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసిన యువతి..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సమాజంపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో కొన్నిసార్లు ఒకే ఒక్క వీడియో లేదా ఫొటోతో కొందరు ఉన్నట్టుండి సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. ఇంకొందరు వినూత్నమైన ఆలోచనలు, ఐడియాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఇక యువతుల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది యువతులు తమ టాలెంట్‌కి పదును పెట్టి.. నెట్టింట విపరీతమైన ఫేమ్ తెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఒకే ఒక్క ఫొటోతో నెటిజన్ల దృష్టిని తన వైపు తిప్పుకొన్న యువతి గురించి.. నెట్టింట ఆసక్తిగా చర్చించుకుంటారు. ఎవరీ అమ్మాయి..? అంటూ ఆరా తీస్తున్నారు.

women-trending-photos.jpg

రాజస్థాన్‌కు చెందిన ఓ యువతి ఫొటో ట్విట్టర్‌లో (young woman Viral photos) తెగ వైరల్ అవుతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. సదరు యువతి ఒకే ఫోజ్‌లో ఉంటుంది. కానీ ఆమె ఉన్న ప్రాంతం మాత్రం ఒక్కో ఫొటోలో ఒక్కోలా మారిపోతూ ఉంటుంది. ఒకసారి జలపాతం వద్ద ఉన్నట్లుగా, మరోసారి లోయల వద్ద ఉన్నట్లుగా, ఇంకోసారి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల వద్ద ఉన్నట్లుగా మారిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఈ యువతి గురించి ఆరా తీయడం మొదలెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే.. అదంతా ఫొటోషాప్ (photoshop) మాయాజాలం అని తెలిసింది. మహారాష్ట్రలోని (Maharashtra) ఖోపోలి ప్రాంతానికి చెందిన నైనా అనే యువతి కుటుంబం.. ప్రస్తుతం జైపూర్‌లో (Jaipur) నివాసం ఉంటోంది. ఈమె ఫిబ్రవరి 21న ఓ వివాహానికి హాజరైంది.

Viral Video: ప్రియురాలికి పువ్వు ఇచ్చి ప్రేమగా ప్రపోజ్ చేశాడు.. అయితే ఉన్నట్టుండి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే..

ఆ వివాహంలో తీసుకున్న ఫొటోను తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది. అలాగే తన ఫొటోను ఎవరైనా ఎడిట్ చేయగలరా అని విన్నవించుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె ఫొటోను.. పలువురు పలు రకాలుగా ఎడిట్ చేసి రీట్వీట్ చేస్తున్నారు. కొందరు అందమైన ప్రదేశాల వద్ద ఉన్నట్లుగా ఎడిట్ చేస్తే.. ఇంకొందరు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ (Prime Minister Narendra Modi and Yogi Adityanath) వద్ద ఉన్నట్లుగా, అల్లు అర్జున్ (Allu Arjun) సినిమాలో హీరోయిన్ లాగా ఎడిట్ చేసి పెట్టారు. ఒకరిని చూసి ఇంకొకరు.. ఇలా ఆమె ఫొటోను తమకు ఇష్టం వచ్చినట్లుగా ఎడిట్ చేసి, పోస్టు చేస్తున్నారు. తన ఫొటోను ఇలా వివిధ రకాలుగా ఎడిట్ చేయడం.. ఆనందాన్ని కలిగిస్తోందని నైనా అంటోంది.

Funny viral video: ఎక్కడా స్థలం లేక డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ.. దిగమని కోరగా చివరకు ఆమె ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటంటే..

Updated Date - 2023-03-16T15:36:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising