ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కారును పార్క్ చేయాలని చూసిన మహిళ.. చివరకు ఆమె పనితనం చూసి.. హెవీ డ్రైవర్ అంటూ నెటిజన్ల చురకలు..

ABN, First Publish Date - 2023-05-10T19:36:53+05:30

కొందరు ఎలాంటి అనుభవం, అవగాహన లేకున్నా.. వాహనాలు వేసుకుని రోడ్ల పైకి వస్తుంటారు. ఇలాంటి సమయాల్లో వీరు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ఎలాంటి అనుభవం, అవగాహన లేకున్నా.. వాహనాలు వేసుకుని రోడ్ల పైకి వస్తుంటారు. ఇలాంటి సమయాల్లో వీరు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహికు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కారు పార్కు చేయాలని ప్రయత్నించిన మహిళ డ్రైవింగ్ పనితనం చూసి నెటిజన్లు ఫన్నీ సెటైర్లు పేల్చుతున్నారు.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి గుమ్టి బజార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కారు డ్రైవ్ చేసుకుంటూ (woman driving car)( గుమ్టి బజార్‌కు వచ్చింది. అయితే వాహనాన్ని పార్క్ చేసేందుకు (Parking) స్థలం చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో డివైడర్ పక్కన వరుసగా బైకులు నిలిపి ఉన్న ప్రాంతం వద్దకు వెళ్తుంది. కారును రివర్స్ చేసే క్రమంలో నేరుగా బైకుల మీదకు ఎక్కిస్తుంది. ఈ ఘటనలో సుమారు ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టు పక్కల ఉన్న వారంతా అక్కడ గుమికూడారు. అయినా మహిళలో ఏమాత్రం కంగారు కనిపించదు. చాలా కూల్‪‌గా బబుల్‌గమ్ నములుతూ కారును మళ్లీ స్టార్ట్ చేసి, వాహానాల కిందకు దించి కాస్త ముంద వైపు నిలుపుతుంది. అయితే అప్పటికే జనం చుట్టుముట్టి ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయే ఆస్కారం లేకుండా పోయింది.

Viral Video: వధువు మెడలో వేస్తుండగా సడన్‌గా తెగిపోయిన దండ.. వరుడు కంగారుపడుతుంటే.. మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..

తమకు నష్టపరిహారం (compensation) చెల్లించాలని బాధిత వాహనదారులు ఆందోళన చేపట్టడంతో గొడవ పెద్దది అవుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. తనకు కారు నడపడంలో పెద్దగా అనుభవం లేదని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు ఎదుట అంగీకరించింది. చివరకు అందరికీ పోలీసులు నచ్చజెప్పడంతో సమస్య సర్దుమణిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral video) అవుతోది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అనుభవం లేకున్నా వాహనాలు వేసుకుని రోడ్ల మీదకు వస్తే ఇలాగే జరుగుతుంది’’.. అని కొందరు, ‘‘బాబోయ్! ఈమె హెవీ డ్రైవర్‌లా ఉందే’.. అని మరికొందరు, ‘‘డ్రైవింగ్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-10T20:42:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising