ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఐదంతస్థుల భవనం పైనుంచి అమాంతం దూకేసిన కుక్క.. కిందపడగానే ఏమైందా అని చూస్తే.. షాకింగ్ సీన్..

ABN, First Publish Date - 2023-10-20T11:57:59+05:30

సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ సీన్లను.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇది కలా లేక నిజమా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా..

సినిమాల్లో చూసే గ్రాఫిక్స్ సీన్లను.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇది కలా లేక నిజమా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనం పైనుంచి ఓ కుక్క అమాంతం దూకేసింది. ఏమైందా అని చూస్తే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనం (five storied building) వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ కుక్క మెట్ల కుండా భవనంపై నాలుగో అంతస్థులోకి వెళ్లింది. అయితే కిందకు దిగే క్రమంలో మాత్రం మెట్లను వినియోగించలేదు. అటూ, ఇటూ తిరిగి చివరకు భవనం అంచుకు వచ్చి నిలబడింది. ఏం చేస్తుందా అని అనుకునే లోపే.. మరింత చివరకు వచ్చి కిందకు చూస్తుంది. కాసేపు తటపటాయించి (dog jumped down from the top of the building) చివరకు పైనుంచి అమాంతం కిందకు దూకేస్తుంది.

Viral Video: ఎలుగుబంటి కోతి చేష్టలు చేయడం ఎప్పుడైనా చూశారా.. నిశ్శబ్ధంగా ఇంట్లోకి ప్రవేశించి.. చివరికి ఏం చేసిందంటే..

ఆ పరిస్థితుల్లో ఏం మనిషైనా, జంతువైనా దాదాపు బ్రతికే అవకాశం ఉండదు. ఒకవేళ బతికినా తీవ్రగాయాలు కావడం ఖాయం. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. పైనుంచి ధబేల్‌మని కిందపడ్డ కుక్క.. ఆశ్చర్యకరంగా టక్కున పైకి లేచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది కలా లేక నిజమా’’.. అంటూ కొందరు, ‘‘ఇది నిజంగా అద్భుతం’’.. అని మరికొందరు, ‘‘ఈ కుక్కకు అద్భుత శక్తులు ఉన్నాయేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 99వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాక్కూడా సిగరెట్ వెలిగించుకోవచ్చని ఇప్పుడే తెలిసింది.. అగ్గిపెట్టె లేదని ఇతను చేసిన పని చూస్తే.. అవాక్కవుతారు..

Updated Date - 2023-10-20T11:59:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising