ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: డేగ కన్ను పడిందంటే ఇలాగే ఉంటుంది మరి.. పామును ఎంత టెక్నిక్‌గా పట్టుకుందో జూమ్‌ చేసి చూస్తే..

ABN, First Publish Date - 2023-10-01T15:16:44+05:30

‘‘డేగ కన్ను’’.. ఈ పదం సందర్భానుసారం తరచూ వాడుతుంటాం. ఆకాశంలో అంతెత్తున్న వెళ్లే డేగలు.. నేల మీద ఉన్న చిన్న చిన్న ఎరలను కూడా గుర్తుపట్టి ఎంతో చాక్యచక్యంగా వేటాడుతుంటాయి. మనిషి చూపు కంటే డేగ చూపు నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది. ఒక్కసారి...

‘‘డేగ కన్ను’’.. ఈ పదం సందర్భానుసారం తరచూ వాడుతుంటాం. ఆకాశంలో అంతెత్తున్న వెళ్లే డేగలు.. నేల మీద ఉన్న చిన్న చిన్న ఎరలను కూడా గుర్తుపట్టి ఎంతో చాక్యచక్యంగా వేటాడుతుంటాయి. మనిషి చూపు కంటే డేగ చూపు నాలుగు రెట్లు తీక్షణంగా ఉంటుంది. ఒక్కసారి వాటి కన్ను పడిదంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. డేగ వేటకు సంబంధించిన సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పామును వేటాడిన డేగ వీడియో వైరల్ అవుతోంది. ఆకాశంలో వెళ్తున్న డేగ పామును పసిగట్టి మీదకు దూకింది. చివరకు దాని ఎంతో టెక్నిక్‌గా పట్టుకుని వేటాడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ చెట్టుపై ఉన్న పామును.. ఎక్కడో ఆకాశంలో వెళ్తున్న డేగ పసిగట్టేసింది. బాగా ఆకలేసిందో ఏమో గానీ.. ముందూ వెనుకా చూడకుండా వెంటనే (eagle attacked snake) దానిపై మెరుపుదాడి చేసింది. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడిన పాము.. డేగ నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ డేగ దాని తలను ఎంతో టెక్నిక్‌గా కాలితో పట్టుకుని పైకి ఎత్తేస్తుంది. ఇలా దాని కాటు నుంచి తప్పించుకుంటేనే పాముకు ఊపిరాడకుండా తొక్కిపట్టుకుంటుంది.

Yellow Teeth: పళ్లు పచ్చగా కనిపిస్తున్నాయా..? ఈ పండు తొక్కను తీసుకుని 4 నిమిషాల పాటు రుద్దితే అద్భుతమైన రిజల్ట్..!

మధ్యలో వదిలేయగానే డేగపై పాము కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి మాత్రం పాముకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా.. ‘‘ఉండు.. నీ సంగతి చెబుతా’’.. అన్నట్లుగా పాము తలను మరింత గట్టిగా పట్టుకుని ముక్కుతో పొడిస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగిసినా.. ఈ పోరాటంలో డేగ చేతిలో పాము చనిపోయినట్లే కనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! డేగ పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘డేగ ఆవేశం చూస్తుంటే భయమేస్తోంది’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో 84వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

Updated Date - 2023-10-01T15:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising