ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ జంట.. పక్కనే వచ్చి ఆగిన పోలీసు కారు.. చివరకు జరిగింది చూసి నెటిజన్లు ఫిదా..!

ABN, First Publish Date - 2023-03-09T18:16:40+05:30

చాలా మంది పోలీసులు చూసేందుకు కోపంగా కనిపించినా.. వారి మనుసు మత్రం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు విధుల్లో ఎంత నిక్కచ్ఛిగా ఉంటారో.. సామాజిక సేవ చేయడంలోనూ అంతే నిబద్ధతగా ఉంటారు. ఇలాంటి పోలీసు అధికారుల గురించి తరచూ వింటూ ఉంటాం. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చాలా మంది పోలీసులు చూసేందుకు కోపంగా కనిపించినా.. వారి మనుసు మత్రం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి వారు విధుల్లో ఎంత నిక్కచ్ఛిగా ఉంటారో.. సామాజిక సేవ చేయడంలోనూ అంతే నిబద్ధతగా ఉంటారు. ఇలాంటి పోలీసు అధికారుల గురించి తరచూ వింటూ ఉంటాం. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఇలాంటి పోలీసు అధికారికి వింత అనుభవం ఎదురైంది. ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ జంటను చూసి, కారు ఆపి ఎక్కించుకున్నారు. చివరకు జరిగింది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‪‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్చి 8న మహిళా దినోత్సవంతో పాటూ హోలీ వేడుకలు (Womens Day and Holi celebrations) కూడా నిర్వహించారు. దీంతో గ్వాలియర్‌లో రవాణా సౌకర్యం బంద్ అయింది. ఈ క్రమంలో స్థానికంగా SDOP (Sub-Divisional Police Officer)గా విధులు నిర్వర్తిస్తున్న సంతోష్ పటేల్ అనే అధికారి కారులో వెళ్తూ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మండే ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధ జంట కనిపించింది. దీంతో కారును ఆపి, ఎక్కడికి వెళ్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. దూరం ప్రాంతం అని చెప్పడంతో.. వేరే వాహనం ఎక్కించాలని ప్రయత్నించాడు.

హోలీ వేడుకల తర్వాత స్నానానికి బాత్రూంకు వెళ్లిన భార్యాభర్తలు.. గంటయినా బయటకు రావడం లేదని పిల్లలు వెళ్లి పక్కింటోళ్లకు చెప్తే..!

అయితే సమీపంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో వారిని తన కారులోనే ఎక్కించుకున్నారు. వారితో సరదాగా మాట కలుపుతూ వారిలోని భయాన్ని పోగొట్టాడు. కాసేపటికి వృద్ధురాలు (old woman) కూడా.. పోలీసు అధికారిని తన మనువడిలా భావించి నవ్వుతూ మాట్లాడింది. సాయం చేసినందుకు కృతజ్ఞతగా, ఆశీర్వదిస్తూ ‘‘ఈ పది రూపాయలు తీసుకోవయ్యా’’.. అంటూ ఆయనకు ఇచ్చే ప్రయత్నం చేసింది. వృద్ధురాలి ప్రేమను చూసి సదరు పోలీసు అధికారి చలించిపోయారు. మరింత ఆనందిస్తూ వృద్ధ జంటకు స్వీట్లు (Sweets) తినిపించి తన ప్రేమను చాటుకున్నారు.

Gold: బంగారం లాంటి ఉద్యోగం.. లక్షల కొద్దీ జీతం.. అయినా ఇదేం పనయ్యా బాబూ..? బంగారాన్ని పేస్టులా మార్చి చేతికి చుట్టుకుని..!

చివరగా వారిని గమ్యస్థానం చేర్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు (Viral photos and videos) తెగ వైరల్ అవుతున్నాయి. గ్వాలియర్‌కు చెందిన యువ పోలీసు అధికారి సంతోష్ పటేల్ (SDOP Santhosh Patel) కు స్థానికంగా మంచి పేరుంది. ఈయన విధుల్లో నిబద్ధతగా పని చేయడంతో పాటూ సామాజిక సేవ చేస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.

Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..

Updated Date - 2023-03-09T18:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising