Mother Emotional Story: నా జీతం రూ.18,500 మాత్రమేనంటూ ఈ తల్లి చెప్పిందంతా విని నెటిజన్ల కంట కన్నీరు.. కొడుకు కథేంటో తెలిసి..!
ABN , First Publish Date - 2023-10-17T16:26:43+05:30 IST
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వివిధ రకాల కథలు మనకు రకరకాల అనుభూతులను పంచుతాయి. కొన్ని నవ్వు తెప్పిస్తాయి. కొన్ని ఆహ్లాదకరంగా ఉంటాయి. మరికొన్ని గుండెల్ని మెలి తిప్పే భావోద్వేగంగా ఉంటాయి. గరిమా సోల్ అనే రెడ్డిట్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ కథనం నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వివిధ రకాల కథలు మనకు రకరకాల అనుభూతులను పంచుతాయి. కొన్ని నవ్వు తెప్పిస్తాయి. కొన్ని ఆహ్లాదకరంగా ఉంటాయి. మరికొన్ని గుండెల్ని మెలి తిప్పే భావోద్వేగంగా ఉంటాయి. గరిమా సోల్ అనే రెడ్డిట్ యూజర్ తాజాగా షేర్ చేసిన ఓ కథనం (Emotional Story) నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్న ఈ స్పూర్తిదాయక కథనం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. సింగిల్ మదర్ (Single Mother) అయిన గరిమా చాలా తక్కువ సంపాదనతో ఢిల్లీలో నివసిస్తోంది.
``నేను తూర్పు ఢిల్లీ (Delhi)లోని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నా. దాని అద్దె నెలకు రూ.5.5 వేలు. నా నెలవారీ సంపాదన రూ.18,500. నాకు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. నా బాబు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతను మాట్లాడలేడు. నేను అతనికి చికిత్స కాదు కదా.. పండ్లు కూడా కొనలేకపోతున్నా. దాంతో అతడిని పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీలకు పంపుతుంటా. నెల చివరికి వచ్చే సరికి నా చేతిలో రూపాయి కూడా ఉండదు. చాలా మంది అద్దె కోసమే రూ.50 వేలు చెల్లిస్తుంటారు. నాకు అంత సంపాదన ఉంటే నా కొడుకు పరిస్థితి ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తుంటా`` అని గరిమా పేర్కొంది.
Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్తే.. సడన్‌గా పెంపుడు కుక్క మిస్సింగ్.. అంతా వెతికిన యజమానికి డౌట్.. చివరకు చెరువులోకి చూస్తే..!
గరిమా పోస్ట్‌పై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఆమెకు సహాయం చేసేందుకు ముందకు వచ్చారు. ``మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలరా? నెలకు రూ.30 వేలు వచ్చే ఉద్యోగం నేను ఇప్పించగలను``, ``మీరు చాలా బలంగా ఉన్నారు. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు``, ``మీ కొడుకు చాలా అదృష్టవంతుడు``, ``మీరు ఇంతే బలంగా ముందుకు సాగాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.