Shocking Incident: భర్త బైక్‌ను ఎక్కిందో మహిళ.. మార్గమధ్యంలో ఆమె అడిగిన ఒక్క మాటతో..
ABN, First Publish Date - 2023-02-10T15:31:32+05:30
రెండు జంటలు (Two couples). ద్విచక్ర వాహనాల (Two-wheelers)పై ప్రయాణం. ఎలాంటి రిలేషన్ లేదు. ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదు. వారెవరో.. వీరెవరో ఒకరికొకరు తెలియదు. వేర్వేరు ప్రయాణాలు. పెట్రోల్ కోసం ఆ రెండు జంటలు అక్కడ ఆగారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు.
మనిషిని పోలిన మనుషులంటారని వింటుంటాం. అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి. అలాగే అప్పుడప్పుడు జాతరలోనో.. లేదంటే పెళ్లిళ్లలోనో.. ఇంకా లేదంటే రైల్వేస్టేషన్లలోనో ఫలానా వారు తప్పిపోయారంటూ మైకుల్లో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. ఇక భార్య ఉండగా.. మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం. అలాగే భర్త ఉండగా మరొకరితో సంబంధం పెట్టుకోవడం చూస్తుంటాం. వింటుంటాం. ఇంకా ఏంటంటే పుట్టిన బిడ్డ తన తల్లెవరో.. తండ్రెవరో స్పర్శను బట్టి గుర్తుపట్టేస్తోంది. అలాగే మూడు ముళ్లతో ఒక్కటైన భార్యాభర్తల (Wife and Husband) సాన్నిహిత్యం కూడా అలాంటిదే. ఇది ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఇది పచ్చి నిజం. అయితే ఇదంతా ఇప్పుడెందుకంటారా? ఈ వార్త చదివాక మీకే అర్థమవుతుంది.
రెండు జంటలు (Two couples). ద్విచక్ర వాహనాల (Two-wheelers)పై ప్రయాణం. ఎలాంటి రిలేషన్ లేదు. ఎలాంటి ఫ్రెండ్‌షిప్ లేదు. వారెవరో.. వీరెవరో ఒకరికొకరు తెలియదు. వేర్వేరు ప్రయాణాలు. పెట్రోల్ కోసం ఆ రెండు జంటలు అక్కడ ఆగారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం నవ్వుకోకుండా ఉండలేరు.
ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..
కర్ణాటక (Karnataka)లోని హావేరి జిల్లా రాణేబెన్నూరు పెట్రోల్ బంక్ (Petrol Bunk)దగ్గరకు వేర్వేరు బైకులపై రెండు జంటలు వచ్చాయి. పెట్రోల్ నింపుకునే సమయంలో మహిళలు ఇద్దరూ కిందకి దిగారు. ట్యాంక్‌లో పెట్రోల్ నింపుకోగానే తన భార్యను బండి ఎక్కమన్నాడు. వాహనంపై అలా కొంత దూరం వెళ్లాక.. ఏవండీ మన ఇల్లు ఇటు కాదు కదా? ఎక్కడి తీసుకెళ్తున్నారని భర్తను ప్రశ్నించింది. ఏంటీ భార్య ఇలా మాట్లాడుతోందని వెనక్కి తిరిగి చూస్తే కూర్చున్నది తన భార్య కాదని షాక్ అయ్యాడు.
బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లిన వ్యక్తి.. అక్కడే నిలబడి ఉన్న మహిళను బైక్ (Bike) ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే కదా? అని ఆమె అనుకుంది. తన భార్య ధరించిన చీరే కట్టుకుని ఉండడంతో వాహనంపై ఉన్న ఆమె తన భార్యేనని పొరబడ్డాడు. భర్త లాంటి బైకు. అదే హుందాతనం. ఒకే రంగు కలిగిన హెల్మెట్ (Helmet) కలిగి ఉండటంతో ఈమె కూడా పొరబడి బండెక్కింది. ఇలా కొంత దూరం ప్రయాణం చేశాక.. వారి మధ్య జరిగిన సంభాషణతో ఖంగుతిన్నారు. పొరపాటు జరిగిపోయిందని తెలుసుకొని కొన్ని నిమిషాల్లోనే తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ఆమె భర్త.. ఆయన భార్య ఎదురుచూస్తున్నారు. నలుగురూ కూడా మొఖం కనబడకుండా శిరస్త్రాణం ధరించడం. పైగా మహిళలిద్దరూ ఒకే రకమైన చీరలు (Sarees) ధరించడంతో ఈ పొరపాటు జరిగిపోయిందని తెలుసుకున్నారు. ఇదంతా యాదృచ్చికంగా జరిగినా అప్పటికే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో వారితో పాటు పెట్రోల్ బంకులో పని చేస్తున్న సిబ్బంది కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
Updated Date - 2023-02-10T15:31:34+05:30 IST