ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: చెల్లి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టి.. చనిపోయిందంటూ ఊరేగించి.. ఇంట్లోని దుస్తులన్నిటినీ తెచ్చి చితిగా పేర్చి..!

ABN, First Publish Date - 2023-07-08T16:08:46+05:30

వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. ఇద్దరు కూతుళ్లు, కొడుకును బాగా చదివించుకున్నారు. తాము కష్టపడుతూ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. అనుకున్నట్లే వారు కూడా బాగా చదువుతున్నారు.. అని అనుకునే సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. ఇద్దరు కూతుళ్లు, కొడుకును బాగా చదివించుకున్నారు. తాము కష్టపడుతూ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. అనుకున్నట్లే వారు కూడా బాగా చదువుతున్నారు.. అని అనుకునే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కూతురు తీసుకున్న అనూహ్య నిర్ణయం.. కుటుంబ సభ్యులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇలా మమ్మల్ని పరువు తీస్తుందా.. అంటూ చెల్లెలి దిష్టిబొమ్మను పాడెపై పడుకోబెట్టిన అన్న.. చివరకు ఆమె దుస్తులన్నింటినీ తెచ్చి నిప్పు పెట్టాడు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) పూర్ణియ ప్రాంత పరిధి చెందిన కిషోర్ సింగ్ అనే వ్యక్తి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల్లో ప్రియాంక అనే యువతి (young woman) ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కిషోర్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా పిల్లలను బాగా చదివిస్తున్నాడు. అయితే తనకు తెలీకుండా కూతురు ఇలా చేస్తుందని మాత్రం ఊహించలేకపోయాడు. డిగ్రీ పాసైన ప్రియాంక.. జూన్ 27న మార్క్‌షీట్ తెచ్చుకునేందుకు కళాశాలకు (College) వెళ్లింది. అయితే సాయంత్రం అవుతున్నా ఆమె ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద విచారించారు. అయినా ఆమె ఎక్కడా లేదని తెలిసింది. చివరకు ప్రియాంక సోదరుడు ప్రశాంత్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. తన చెల్లెలిని ఇదే ప్రాంతానికి చెందిన మనోజ్ అనే యువకుడు కిడ్నాప్ (Kidnapping) చేశాడని ఆరోపించాడు.

Wheel Less Bicycle: ఈ ఇంజనీర్‌ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. టైర్లు లేకుండానే సైకిల్‌ను రెడీ చేసేశాడు..!

పోలీసులు కేసు నమోదు చేసి, సదరు యువకుడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చివరకు ప్రియాంక ఫోన్ చేసి, మనోజ్‌ను తాను ప్రేమించానని (love) చెప్పింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన ఇష్టప్రకారమే వెళ్లాలని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ఇది విన్న యువతి సోదరు ప్రశాంత్‍కి కోపం కట్టలు తెంచుకుంది. ఇంత కష్టపడి చదివిస్తే.. ఇలా ఇంట్లో చెప్పకుండా పరాయి వ్యక్తితో వెళ్లిపోతుందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ కుటుంబం దృష్టిలో తన చెల్లెలు చనిపోయిందంటూ పాడె సిద్ధం చేశాడు. చెల్లెలి దిష్టి బొమ్మను పాడెపై పడుకోబెట్టి, ఆమెకు సంబంధించిన దస్తులన్నీ తెచ్చి దహనం చేశాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral video: మా అమ్మకు దక్కిన అత్యున్నత పురస్కారం.. అంటూ కూతురు పెట్టిన వీడియో చూస్తే..

Updated Date - 2023-07-08T16:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising