ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌తో నర్సు ప్రేమాయణం.. పెళ్లి చేసుకునే ముందు విచారించగా.. అసలు విషయం తెలియడంతో ఖంగుతిన్న యువతి..

ABN, First Publish Date - 2023-03-15T18:53:20+05:30

యువతులతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొందరు ఉత్తమ మార్గాలను ఎంచుకుంటుండగా.. మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంకొందరు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

యువతులతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొందరు ఉత్తమ మార్గాలను ఎంచుకుంటుండగా.. మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇంకొందరు లైంగిక దాడులతో పాటూ చివరకు హత్యలు చేసేందుకూ వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ నర్సు డాక్టర్‌తో ప్రేమాయణం సాగించింది. అయితే తీరా పెళ్లి చేసుకునే క్రమంలో అతడి గురించి విచారించి.. చివరకు షాక్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాయ్‌పూర్ పరిధి అభన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన నీలేష్ మండే అనే యువకుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వార్డ్ బాయ్‌గా (Ward boy) పని చేస్తుంటాడు. ఇతడు ఇటీవల యువతులతో పరిచయం కోసం సోషల్ మీడియాలో సెర్చింగ్ చేసేవాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఐడియా వచ్చింది. తాను వార్డ్ బాయ్ అనే విషయం తెలిస్తే ఎవరూ మాట్లాడారని భావించి, ఎయిమ్స్ ఆస్పత్రిలో (AIIMS Hospital) ప్రముఖ వైద్యుడిగా ప్రకటించుకున్నాడు. రెండేళ్ల కిందట ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో (Matrimony website) ఇదే ప్రొఫైల్‌తో రిజిస్టర్ చేసుకున్నాడు. తర్వాత అతడికి ఓ నర్సు పరిచయమైంది. ఇతడు ప్రముఖ వైద్యుడినని (famous doctor) చెప్పడంతో ఆమె కూడా త్వరగా దగ్గరైంది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది.

Viral Video: పాము, ముంగిస మధ్య బిగ్ ఫైట్.. ఆశ్చర్యకరంగా చివర్లో ఇలా జరిగిందేంటీ..

ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి, పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. ఇటీవల ఆమెతో నిశ్చితార్థం (Engagement) కూడా చేసుకున్నాడు. త్వరలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఎందుకో అతడిపై ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో అసలు అతను డాక్టరా కాదా అనే విషయం తెలుసుకోవాలని అనుకుంది. తెలిసిన వారి ద్వారా విచారించగా.. నీలేష్ వైద్యుడు కాదని తెలిసింది. దీంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. మరోవైపు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశిస్తున్న కోతి.. అడుగడుగుకూ దండాలు పెడుతూ.. ఎలా వేడుకుంటుందో చూడండి..

Updated Date - 2023-03-15T18:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising