కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tea Kills Child: చిన్న పిల్లలకు టీ ఇస్తున్నారా..? ఏడాదిన్నర వయసున్న ఈ చిన్నారి టీ వల్ల ఎలా చనిపోయిందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-08-08T19:31:03+05:30

రోజూ ఉదయాన్నే అందరికీ ఉత్సాహాన్ని అందించే టీ.. ఈ కుటుంబంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది. అప్పటిదాకా సరదాగా ఆడుకుంటున్న చిన్నారికి.. అదే చివరికి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఉదయాన్నే తల్లి ప్రేమతో అందించిన టీ తాగిన చిన్నారి.. అంతలోనే...

Tea Kills Child: చిన్న పిల్లలకు టీ ఇస్తున్నారా..? ఏడాదిన్నర వయసున్న ఈ చిన్నారి టీ వల్ల ఎలా చనిపోయిందో తెలిస్తే..!

రోజూ ఉదయాన్నే అందరికీ ఉత్సాహాన్ని అందించే టీ.. ఈ కుటుంబంలో మాత్రం విషాదాన్ని మిగిల్చింది. అప్పటిదాకా సరదాగా ఆడుకుంటున్న చిన్నారికి.. అదే చివరికి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఉదయాన్నే తల్లి ప్రేమతో అందించిన టీ తాగిన చిన్నారి.. అంతలోనే తీవ్ర అస్వస్తకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. స్థానికులను కంట తడి పెట్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సిమ్రోల్ పరిధి బైగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నావాడ్ జిల్లా దేవాస్‌ ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తికి లత అనే యువతితో వివాహం (marriage) జరిగింది. వీరికి ప్రస్తుతం కూతురు, ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. ఇలావుండగా, ఇటీవల రాజేష్ తన సోదరుడితో కలిసి ఆస్తి విషయంలో తల్లిపై దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో రాజేష్ ప్రజాపత్‌ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం రాజేష్ భార్య తన కొడుకుతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. అసలే భర్త జైల్లో ఉండడంతో బాధలో ఉన్న వీరి కుటుంబంలో మరో ఊహించని (tragic incident) విషాదం చోటు చేసుకుంది.

Wife: పెళ్లయిన 15వ రోజే పోలీస్ స్టేషన్లో నవ వధువు.. భర్త గురించి చెప్పిన నిజాలు విని విస్తుపోయిన పోలీసులు.. చివరకు..!

ఇటీవల ఓ రోజు ఉదయం లత తన పిల్లలకు (mother gave tea to children) టీ చేసి ఇచ్చింది. ఇది తాగిన కొడుకు మధ్యలోనే పొరపోయాడు. విపరీతంగా దగ్గుతుండడంతో తల్లి కంగారుగా కొడుకు వీపు మీద తట్టింది. అయినా దగ్గు ఆగకపోవడంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. ఇండోర్‌లో పెద్దాసుపత్రికి (Indoor hospital) రెఫర్ చేశారు. అక్కడి వెళ్లగానే పరీక్షించిన వైద్యులు.. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అప్పటిదాకా సరదాగా ఆడుకున్న కొడుకు.. టీ కారణంగా మృతి చెందడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. కొడుకు మృతదేహంపై పడి బోరున విలపించింది. పోలీసులు బాలుడి మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Bride: కారు తీసుకొస్తా.. గదిలోనే ఉండంటూ హోటల్ నుంచి బయటకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చే సరికి ఊహించని ట్విస్ట్..!

Updated Date - 2023-08-08T19:31:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising