వాషింగ్ మెషీన్‌లో పడిపోయిన ఏడాదిన్నర కొడుకు.. 15 నిమిషాల పాటు గుర్తించలేకపోయిన తల్లి.. ఆ పిల్లాడి పరిస్థితి ఏంటంటే..!
ABN , First Publish Date - 2023-02-15T17:16:08+05:30 IST
కాస్త నిర్లక్ష్యం చేస్తే చాలు ఊహించని దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. ఒకటిన్నర సంవత్సరం పిల్లాడి విషయంలో అదే జరిగింది. తల్లి ఇంటిపనుల్లో మునిగిపోయి ఉండగా
చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఎన్ని పనులు చేసుకుంటున్నా పిల్లలను ఒక కంట కనిపెట్టుకునే ఉంటారు. ఎప్పుడైనా కాస్త నిర్లక్ష్యం చేస్తే చాలు ఊహించని దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. ఒకటిన్నర సంవత్సరం పిల్లాడి విషయంలో అదే జరిగింది. తల్లి ఇంటిపనుల్లో మునిగిపోయి ఉండగా వాషింగ్ మెషీన్ లో పడిపోయాడు పిల్లాడు. అందరినీ ఆందోళనకు గురిచేసే ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
(NEW DELHI)ఢిల్లీలో ఓ మహిళ తన ఇంట్లో టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ (top loading washing mechine) బట్టలు వేసింది. ఆమె వేరే పని కోసం పక్క గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో ఒకటిన్న సంవత్సరం (one and half years boy) పిల్లాడి గురించి అంతగా ఆలోచించలేదు. ఆ తరువాత పిల్లాడి అల్లరి వినిపించడం లేదేంటని పిల్లాడికోసం ఇల్లంతా వెతికింది కానీ ఎక్కడా పిల్లాడు కనిపించలేదు. దీంతో కంగారుగా వాషింగ్ మెషిన్ ఉన్న గదిలోకి వెళ్ళి చూసింది. వాషింగ్ మెషీన్లో సోప్ నీళ్ళలో పిల్లాడు కనిపించాడు. వెంటనే బాబును బయటకు తీసి హాస్పిటల్ కు తీసుకెళ్ళారు.
Read also: అబ్బ.. ఏం ఐడియా గురూ.. రైల్లో ప్రయాణిస్తూ.. నిద్ర మత్తులో పక్కనున్న వాళ్ల మీద పడితే తిడుతున్నారని..
ఢిల్లీలోని ఫోర్టీస్ (fortis) హాస్పిటల్ కు పిల్లాడిని తీసుకెళ్ళిన సమయంలో పిల్లాడి శరీరం నీలం రంగులోకి మారిపోయి, హార్ట్ బీట్ (heart beat) ఆగిపోయిందట. అలాంటి పరిస్థితిలో పిల్లాడిని చూసి హాస్పిటల్ వారు కూడా ఆందోళనకు గురయ్యారు. బాబుకు ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. రెండురోజుల పాటు ఆ బాబు కోమాలో ఉన్నాడట. శరీరంలో చాలా అవయవాలు పనిచేయకుండా పోయాయట. ఆ తరువాత డాక్టర్లు యాంటీబయోటిక్స్, ఫ్లూయిడ్స్ ఎక్కించి పిల్లాడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రెండురోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆ పిల్లాడు. తరువాత కోమాలో నుండి బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వారం రోజుల పాటు ఐసీయూ (ICU) లో ఉంచారు. ఆ తరువాత నార్మల్ వార్డుకు మార్చారు. ఇప్పుడు బాబు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా బాబు కోలుకోవడం వండర్ అని అంటున్నారు డాక్టర్లు. వాషింగ్ మెషీన్ దగ్గర చైర్ ఉందని అది ఎక్కి కూర్చోవడానికి ప్రయత్నం చేసినపుడు బాబు వాషింగ్ మెషిన్ లో పడిపోయి ఉండచ్చని బాబు తల్లి తెలిపింది. ఏది ఏమైనా పిల్లాడు బ్రతికాడు, ఇకమీద పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు నెటిజన్లు