ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: నదిలో ఈత కొడుతున్న యువకుల కాళ్లకు తగిలిందో మూట... కష్టపడి బయటికి లాక్కొచ్చి తెరచి చూడగా..

ABN, First Publish Date - 2023-10-11T20:02:06+05:30

ఊహించని ప్రదేశాల్లో అనుమానాస్పద వస్తువులు బయటపడడం తరచూ చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే, ఇంకొన్నిసార్లు అంతా షాక్ అయ్యేలా..

ఊహించని ప్రదేశాల్లో అనుమానాస్పద వస్తువులు బయటపడడం తరచూ చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే, ఇంకొన్నిసార్లు అంతా షాక్ అయ్యేలా మనుషుల మృతదేహాలు కనబడుతుంటాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, బీహార్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. నదిలో ఈత కొడుతున్న కొందరు.. కాళ్లకు ఏదో పెద్ద మూట తగలడంతో భయపడ్డారు. చివరకు దాన్ని బయటకు తీసుకొచ్చి తెరచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని జముయి జిల్లాలో (Bihar Jamui District) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చకై పోలీస్ స్టేషన్ పరిధిలోని బామ్‌దా పంచాయతీ ధోడ్సా కోలా బహియార్ ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు మంగళవారం సాయంత్రం ఇక్కడి నదిలోకి (People went to bathe in river) స్నానానికి వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో వారి కాళ్లకు ఏదో మూట తగలడంతో మొదట భయపడ్డారు. కాసేపటికి అంతా కలిసి అందులో ఏముందో కనుక్కోవాలని అనుకున్నారు. చివరకు ఎంతో కష్టపడి మూటను బయటకు లాక్కొచ్చారు.

Viral Video: ఏనుగుకు చిర్రెత్తుకొస్తే ఇలాగే ఉంటుంది మరి.. అంతపెద్ద చెట్టును గడ్డిపోచలా ఎలా పీకిపడేసిందో చూడండి..

మూట తెరచి చూడగా అందులో యువతి మృతదేహం (young woman dead body) ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు సుమారు 27ఏళ్లు ఉంటాయని, ఎర్రటి చీర ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ఎవరో హత్య చేసి సంచిలో మూటకట్టి పడేసి వెళ్లారని తెలిసింది. అయితే ఇంత వరకూ మృతదేహం వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హత్య మిస్టరీని ఛేందించేందకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-10-11T20:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising