నన్ను చంపేశారు.. రూ.25 కోట్లు పరిహారం ఇప్పించండంటూ హైకోర్టులో వింత కేసు.. నువ్వు దెయ్యానివి అనడానికి ఆధారాలు లేవంటూ..!
ABN, First Publish Date - 2023-03-03T21:05:15+05:30
కొన్నిసార్లు కొందరు చిత్రవిచిత్రమైన సమస్యలతో కోర్టులను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు సైతం.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. నన్ను చంపేశారు..
కొన్నిసార్లు కొందరు చిత్రవిచిత్రమైన సమస్యలతో కోర్టులను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు సైతం.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. నన్ను చంపేశారు.. రూ.25కోట్ల పరిహారం (25 crore compensation) ఇప్పించాలంటూ విన్నవించుకున్నాడు. అయితే ‘‘నువ్వు దెయ్యానివి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో సదరు వ్యక్తి.. త్వరలో సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అజ్‌మర్ జిల్లా ముబారక్‌పూర్ పరిధి అమీలోన్ గ్రామానికి చెందిన లాల్‌బిహారి అనే వ్యక్తికి విచిత్ర సమస్య వచ్చి పడింది. 1976లో లాల్‌బిహారీకి చెందిన కొంత భూమిని వారి బంధువులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రికార్డుల్లో లాల్‌బిహారీ చనిపోయినట్లుగా నమోదు చేయించారు. అప్పటి నుంచి ఏళ్లుగా ఇతను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తాను బతికే ఉన్నా అని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిది. ఈ క్రమంలో 1994లో సదరు వ్యక్తి సజీవంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
అయితే తాను బతికి ఉన్నా అని నిరూపించుకునే క్రమంలో ఇన్నేళ్లు తన సమయం ఎంతో వృథా అయిందని, తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. తనకు రూ.25కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లక్నో హైకోర్టును (Lucknow High Court) ఆశ్రయించాడు. అయితే ఇతడి పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. సదరు వ్యక్తి దయ్యం అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. లాల్‌బిహారి చనిపోయినట్లు ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదని కోర్టు పేర్కొంది. చివరకు బిహారీకి రూ.10వేల జరిమానా విధించింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని, త్వరలో సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించనున్నట్లు లాల్‌బిహారి చెబుతున్నాడు. మొత్తానికి బిహారీ సమస్య సోషల్ మీడియాలో కూడా హాట్‌టాపిక్‌గా మారింది.
Updated Date - 2023-03-03T21:05:15+05:30 IST