ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్తపై నమోదైన వేధింపుల కేసును.. వెంటనే ఎత్తేయాలంటూ టవర్ ఎక్కిన భార్య.. చివరకు ఆమె చెప్పింది విని అంతా షాక్..

ABN, First Publish Date - 2023-03-12T16:59:05+05:30

భర్తపై వేధింపుల కేసు నమోదు చేస్తే.. భార్య టవర్ ఎక్కడమేంటని ఆశ్చర్యపోతున్నారా. అక్కడున్న వారు కూడా ఇలాగే అవాక్కయ్యారు. అంతా చూస్తుండగా ఓ మహిళ ఉన్నట్టుండి పెద్ద టవర్ ఎక్కింది. దీంతో ఒక్కసారిగా అక్కడ జనం గుమికూడారు. తన భర్తపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భర్తపై వేధింపుల కేసు నమోదు చేస్తే.. భార్య టవర్ ఎక్కడమేంటని ఆశ్చర్యపోతున్నారా. అక్కడున్న వారు కూడా ఇలాగే అవాక్కయ్యారు. అంతా చూస్తుండగా ఓ మహిళ ఉన్నట్టుండి పెద్ద టవర్ ఎక్కింది. దీంతో ఒక్కసారిగా అక్కడ జనం గుమికూడారు. తన భర్తపై నమోదు చేసిన వేధింపుల కేసు ఎత్తేయాలంటూ డిమాండ్ చేయడం చూసి.. పోలీసులతో పాటూ అక్కడున్న అధికారులంతా ఖంగుతిన్నారు. చివరకు అసలు విషయం తెలుసుకుని, ఆమెను శాంతిపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర (Maharashtra) బుల్దానా జిల్లా మెహకర్ పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం (Tehsildar Office) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ (woman) ఉన్నట్టుండి అక్కడున్న టవర్ ఎక్కి ఆందోళన చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలియడంతో చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తన భర్తపై వేధింపుల కేసులు (Harassment cases) వెంటనే ఎత్తేయాలని ఆమె డిమాండ్ చేయడం చూసి అంతా అవాక్కయ్యారు. చివరకు పోలీసులు, తహసీల్దారు హామీతో ఆమె కిందకు దిగింది. మహిళను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అక్కడేమీ బ్రేక్ డ్యాన్సులు కూడా లేవు.. కానీ కరెన్సీ నోట్ల వర్షం కురిసింది.. కుప్పలుగా పడిన నోట్ల మధ్యలో..

గ్రామంలో ఓ మహిళన ఈమె భర్తపై వేధింపులు కేసు పెట్టింది. తన భర్త తప్పు చేయలేదని ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. పోలీసులు వినిపించుకోలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహిళ తెలిపింది. తన భర్త ఎవరినీ వేధించలేదని, కావాలనే తప్పుడు కేసులు పెట్టారని ఆమె ఆరోపించింది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, తన భర్తపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరింది. కాగా, మహిళ టవర్ ఎక్కిన ఫొటోలు, వీడియోలు.. నెట్టింట తెగ వైరల్ (Viral photos and videos) అవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-12T16:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising