Police: ఓ ఇంట్లోకి అదే పనిగా ఎక్కువ మంది వస్తూ ఉండటంపై స్థానికులకు డౌట్.. విషయం తెలిసి పోలీసులు సడన్గా సెర్చ్ చేస్తే..!
ABN, First Publish Date - 2023-09-29T16:42:20+05:30
డబ్బుల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధపడే ప్రస్తుత సమాజంలో కొందరు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా, హర్యానాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి...
డబ్బుల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధపడే ప్రస్తుత సమాజంలో కొందరు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనులు చేస్తూ అందరితో ఛీకొట్టించుకుంటుంటారు. తాజాగా, హర్యానాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి రోజూ చాలా మంది అదే పనిగా వెళ్లి వస్తూ ఉండడాన్ని చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి ఇంట్లో తనిఖీలు చేయగా.. షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
హర్యానా (Haryana) నుహ్ జిల్లా పింగవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రహపువా రోడ్డులో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంధేటా ప్రాంతానికి చెందిన జుబేర్ అలియాస్ ముచ్చల్ అనే వ్యక్తి.. పింగవాన్లోని తన ఇంట్లో వ్యభిచారాన్ని (Prostitution) మొదలెట్టాడు. చాలా రోజులుగా బాలికలు, యువతులను (Girls and young women) తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ముందు ఎవరికీ అనుమానం రాలేదు. అయితే రోజూ చాలా మంది మగవాళ్లు వస్తూ, పోతూ ఉండడం చూసి స్థానికులకు అనుమానం కలిగింది.
ఇలా కొన్నిరోజులు గమనించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో తనిఖీలు చేయగా విషయం బయటపడింది. ఓ మహిళ సహా ముగ్గురు యువకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిర్వాహకుడు ఈ విషయం తెలుసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇకపై ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-09-29T16:54:11+05:30 IST