OYO Rooms: అమ్మ బాబోయ్.. ఓయో రూమ్స్‌ను ఇలాంటి పనులకు కూడా వాడుతున్నారా..? పోలీసుల రైడింగ్‌తో వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!
ABN, First Publish Date - 2023-02-23T19:59:05+05:30
మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడ పురుగులుండు.. అన్నట్లుగా కొన్నిసార్లు మనకు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. కొందరు నేరస్థులు పోలీసులకు అనుమానం రాకుండా వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. పైకి అంతా మంచిగా ఉన్నట్లు అందరినీ నమ్మించి.. లోపల..
మేడిపండు చూడ మేలిమై ఉండును.. పొట్టవిప్పి చూడ పురుగులుండు.. అన్నట్లుగా కొన్నిసార్లు మనకు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. కొందరు నేరస్థులు పోలీసులకు అనుమానం రాకుండా వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. పైకి అంతా మంచిగా ఉన్నట్లు అందరినీ నమ్మించి.. లోపల వారి నేరాలను యథేచ్ఛగా కొనసాగిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పైకి చూడటానికి అవి ఓయో రూమ్స్.. కానీ అందులో జరిగే కార్యకలాపాలు వేరే ఉన్నాయి. అసలు విషయం బయటపడేదాకా ఈ సంగతి ఎవరికీ తెలియదు. సమాచారం అందుకున్న పోలీసులు.. హోటల్‌పై సడన్ రైడ్ చేశారు. దీంతో చివరకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలోని గౌతమ్‌బుద్ధ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెక్టార్41లో ఓ ఓయోకు సంబంధించిన హోటల్ (Oyo Hotels) ఉంది. సమాచారం మేరకు బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో పోలీసు బృందాలు (Police teams) అక్కడికి చేరుకున్నాయి. ఉన్నట్టుండి పోలీసులు రావడంతో హోటల్ యాజమాన్యం కంగారుపడింది. లోపలికి వెళ్లిన పోలీసులు.. ప్రతి గదినీ క్షణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో వారికి సుమారు 7మంది యువతులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. విచారించగా సరైన కారణాలు చెప్పకపోవడంతో అందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు ఢిల్లీకి చెందిన వారు కాగా.. నోయిడాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. లోతుగా విచారించగా ఓయో యాప్‌లో బుక్ చేసుకోవడం ద్వారా వీరు ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది.
Viral Video: వావ్.. ఏం వీడియో గురూ.. చూసిన వాళ్లంతా ఫిదా అయిపోతున్నారుగా..!
సాహిల్ అనే వ్యక్తి తమను ఇక్కడికి తీసుకొచ్చారని సదరు యువతులు తెలిపారు. యువతులను (young women) పంపడం ద్వారా సుమారు రూ.5వేల నుంచి రూ.8వేలు తీసుకుంటున్నట్లు తేలింది. గజేంద్రకుమార్, అలోక్ సింగ్, ప్రవీణ్ సింగ్, ధర్మేంద్ర కుమార్ అనే నిందితులు (Accused) యువకులను హోటల్‌కు తీసుకురావడం, తీసుకెళ్లడం చేస్తుండేవారని పోలీసులు తెలిపారు. సదరు హోటల్‌ను కూడా సీజ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరందిరినీ అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే వారి వద్ద నుంచి సుమారు 15మొబైల్ ఫోన్లు (Mobile phones) తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2023-02-23T19:59:09+05:30 IST