ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఎవరీ పాప..? పెంచుకుంటామంటూ ఆ గ్రామంలోని ప్రజలంతా ఎందుకు ఎగబడ్డారు..? పోలీసుల ఎంట్రీతో ఊహించని సీన్..!

ABN, First Publish Date - 2023-11-02T15:36:34+05:30

కొందరు మహిళలు తల్లి అనే పేరుకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. తెలిసి తెలిసి తప్పులు చేయడం.. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ తప్పులు చేస్తుంటారు. ప్రేమ, వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...

కొందరు మహిళలు తల్లి అనే పేరుకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. తెలిసి తెలిసి తప్పులు చేయడం.. ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ తప్పులు చేస్తుంటారు. ప్రేమ, వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, హర్యానాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చెత్తకుప్పలో పడి ఉన్న శిశువును పెంచుకుంటామంటూ గ్రామస్తులంతా ఎగబడ్డారు. చివరకు పోలీసుల ఎంట్రీతో ఏం జరిగిందంటే..

హర్యానాలోని (Haryana) నుహ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గోధౌలా గ్రామంలో బుధవారం ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామంలోని చెత్తకుప్పలో దుస్తులతో చుట్టి ఉన్న మూట కనపడింది. దీంతో అందులో ఏముందా అని కొందరు వెళ్లి విప్పి చూశారు. లోపల నవజాత శిశువు (newborn baby) ఉండడం చూసి షాక్ అయ్యారు. ఈ వార్త తెలియగానే గ్రామస్తులంతా అక్కడ గుమికూడారు. పాపను దత్తత తీసుకునేందుకు ఒకరిని మంచి మరొకరు పోటీ పడ్డారు. కొందరైతే సంతోషంతో అందరికీ లడ్డూలు కూడా పంపిణీ చేశారు.

Viral Video: లిఫ్ట్‌లో ఇద్దరు మహిళల నిర్వాకాన్ని వీడియో తీయబోయిన వ్యక్తి.. కాసేపటికి ఆమె భర్త అక్కడికి రావడంతో.. చివరకు..

అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని మహిళ.. శిశువును వదిలించుకోవాలనే ఉద్దేశంతో చెత్తకుప్పల్లో పడేసి వెళ్లినట్లు తెలిసింది. పాపకు రెండు రోజుల క్రితమే జన్మించి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కాగా, శిశువును దత్తత తీసుకుంటామని గ్రామస్తులు కోరినా పోలీసులు అంగీకరించలేదు. చట్టపరమైన కార్యక్రమాల అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: హైదరాబాద్‌లో నిరుద్యోగుల పరిస్థితి మరీ ఇంత దారుణంగానా..? ఒక్క ఇంటర్వ్యూకు ఎన్ని వేల మంది వచ్చారో చూస్తే..!

Updated Date - 2023-11-02T15:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising