ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-08-05T15:44:52+05:30

ఓ ఆస్పత్రిలో సినిమా తరహా ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్ల వద్దకు వెళ్లే విలన్లు.. చివరకు వారికి ఇంజెక్షన్ చేసి చంపేసే ఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే తీరా ఇంజెక్షన్ చేసే క్రమంలో ఎవరో ఒకరు వచ్చి వారిని అడ్డుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు...

ప్రతీకాత్మక చిత్రం

ఓ ఆస్పత్రిలో సినిమా తరహా ట్విస్ట్ చోటు చేసుకుంది. పేషెంట్ల వద్దకు వెళ్లే విలన్లు.. చివరకు వారికి ఇంజెక్షన్ చేసి చంపేసే ఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అలాగే తీరా ఇంజెక్షన్ చేసే క్రమంలో ఎవరో ఒకరు వచ్చి వారిని అడ్డుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సీన్లు కొన్నిసార్లు నిజ జీవితంలోనూ చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, కేరళలో అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 25ఏళ్ల ఓ యువతి చేతిలో ఇంజెక్షన్ పట్టుకుని బాలింత గదిలోకి వెళ్లింది. నర్సులకు డౌట్ వచ్చి నిలదీయగా చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

కేరళలోని (Kerala) పాతనంతిట్ట ప్రాంత పరిధి పరుమలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ మహిళ (woman) నాలుగు రోజుల క్రితం ఇక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం ఆస్పత్రిలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువతి నర్సు వేషంలో ప్రసవించిన మహిళ గదిలోకి వెళ్లింది. లోపలికి వెళ్లిన ఆమె ఊహించని విధంగా మహిళకు ఇంజెక్షన్ చేసి (Conspiracy to kill woman) హత్య చేసేందుకు ప్రయత్నించింది. అప్పటికే ఆస్పత్రి సిబ్బందికి అనుమానం వచ్చి సదరు యవతిని పట్టుకుని నిలదీశారు. ఏం చేస్తున్నావంటూ గట్టిగా ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆమెపై మరింత అనుమానం కలిగి పోలీసులకు సమాచారం అందించారు.

Wife: అందం కోసం భర్త సంపాదనను కరిగించేస్తున్న భార్య.. అంతా పతి కోసమేనంటూ ప్లాస్టిక్ సర్జరీలకై కోట్లలో ఖర్చు..!

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తీసుకెళ్లారు. విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చిన మహిళ భర్తకు యువతి స్నేహితురాలని తేలింది. యువతి భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. దీంతో యువతికి, మహిళ భర్తకు వివాహేతర సంబంధం ఏమైనా ఉందా, ఈ కారణంగానే సదరు యువతి మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Death Mystery: అమ్మలూ.. బీ అలెర్ట్.. వంటింట్లో వాడే కుక్కర్ ఈ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో తెలిస్తే..!

Updated Date - 2023-08-05T15:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising