ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: డబ్బు సంపాదనకు భార్యాభర్తల వెరైటీ ప్లాన్.. వారి బెడ్రూంలోని బల్బ్ హోల్డర్‌ను విప్పి చూసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్..

ABN, First Publish Date - 2023-09-02T21:54:22+05:30

డబ్బు సంపాదనకు కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి మనుషుల బలహీనతను తమ పెట్టుబడిగా మార్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి రోజూ వింటూనే ఉంటాం. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

డబ్బు సంపాదనకు కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి మనుషుల బలహీనతను తమ పెట్టుబడిగా మార్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి రోజూ వింటూనే ఉంటాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. డబ్బు సంపాదనకు ఓ జంట వెరైటీ ప్లాన్ వేసింది. చివరకు పోలీసులు వారి ఇంటి బెడ్రూంలోని కరెంట్ బల్బ్ హోల్డర్‌ను విప్పి చూశారు. అందులోని దృశ్యాలను చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గుణ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన దేవేంద్ర జదౌన్ అనే వ్యక్తి.. డబ్బు సంపాదన కోసం తన భార్యతో కలిసి వినూత్న ప్లాన్ వేశాడు. తాజాగా, దీపక్ జైన్ అనే వస్త్ర వ్యాపారి ఫిర్యాదుతో ఈ దంపతుల నేరాల చిట్టా వెలుగులోకి వచ్చింది. దేవేంద్ర జదౌన్ భార్య కొన్ని నెలల క్రితం వస్త్ర వ్యాపారికి సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేస్తూ అతడికి (woman friendship with cloth merchant) బాగా దగ్గరైంది. ఈ క్రమంలో ఓ రోజు తనకు అర్జంట్ అవసరం ఉందంటూ రూ.5,500లు అప్పుగా తీసుకుంది. వడ్డీతో కలిపి మొత్తం చెల్లిస్తా అని చెప్పడంతో వస్త్ర వ్యాపారి కూడా నమ్మాడు.

Virtual Lover: నలుగురు పిల్లలతో పాటు తల్లి దారుణ హత్య.. భర్తపై డౌట్ వచ్చింది కానీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఈ క్రమంలో డబ్బు తిరిగి ఇస్తా అని చెప్పి వ్యాపారిని ఆగస్టు 5న తన ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన అతడికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. దస్తులు తీసేసి అసభ్యకరంగా వీడియోలు (Indecent videos) చిత్రీకరించారు. తర్వాత ఆగస్టు 22న ఈ వీడియోలను సదరు వ్యాపారికి పంపించారు. వెంటనే రూ.3లక్షలు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరించారు. వారు అడిగిన డబ్బులు ఇచ్చాక కూడా.. మరింత కావాలంటూ బెదిరిస్తుండడంతో బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

పోలీసుల విచారణలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సదరు దంపతులు కొందరు ముఠా సభ్యులతో కలిసి ఇలాంటి దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. వారి బెడ్రూంలో బల్పు హోల్డర్‌లో కెమెరాను (Camera in bulb holder) అమర్చి, తద్వారా అశ్లీల వీడియోలను తీసేశారని తెలిసింది. ఆ వీడియోలను చూపించి బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా వెనుక స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బీజేపీ నాయకడికి హస్తం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఇతడి తెలివితేటలు చూస్తే.. ఇలాక్కూడా డబ్బు సంపాదించవచ్చా.. అని మీరే అంటారు..

Updated Date - 2023-09-02T21:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising