ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో భర్త.. మెడికల్ టెస్టులు చేసి.. భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు కథేంటంటే..!

ABN, First Publish Date - 2023-08-03T20:16:17+05:30

తెలిసి తెలిసి తప్పులు చేసి దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకునే వారు కొందరైతే.. మరికొందరు వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరకు హత్యలు, ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. కొందరైతే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

తెలిసి తెలిసి తప్పులు చేసి దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకునే వారు కొందరైతే.. మరికొందరు వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరకు హత్యలు, ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. కొందరైతే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. చిత్రవిచిత్రమైన ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా, ముంబైలో ఈ తరహా కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. విచారణ చేసిన పోలీసులు.. చివరకు అతడి భార్యను అరెస్ట్ చేశారు. ఇంతకీ అసలు కథేంటంటే..

ముంబైలోని (Mumbai) శాంతాక్రజ్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కమల్ కాంత్ షా అనే వ్యక్తి భార్య కవిత, తల్లి సరళాదేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతడు వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొన్నేళ్ల క్రితం ఇతడి భార్య కవితకు స్థానిక ప్రాంతానికి చెందిన హితేష్ జైన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్త లేని సమయంలో ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో గొడవల కారణంగా భార్యభర్తలు కొన్ని నెలల పాటు దూరంగా ఉన్నారు. అయితే 2022లో మళ్లీ కలిసి జీవిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని కవిత, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు.

Viral Video: ఓ చిన్న అద్దం వల్ల కారు ఎలా కాలిపోయిందో చూడండి.. కారు డోర్ తీయగానే..!

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా తన భర్తకు భోజనంలో రోజూ కొంచెం కొంచెం విషం (poison) ఇస్తూ వచ్చింది. దీంతో కొన్నాళ్లకు కమల్ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 2022 సెప్టెంబర్‌లో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయితే సెప్టెంబర్ 19న చికిత్స పొందుతూ మరణించాడు. పరీక్షల్లో విషం కారణంగానే మృతి చెందినట్లు తెలిసింది. అలాగే మరుసటి నెలలో కమల్ కాంత్ తల్లి కూడా ఇదే విధంగానే చనిపోయింది. వీరి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కవిత కాల్ డేటా రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2022 డిసెంబర్‌లో కవితతో పాటూ ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల కమల్ కాంత్ పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. కవిత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

Updated Date - 2023-08-03T20:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising