ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కారుపై కేకులు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు.. చివరకు ఈ యువకులకు గట్టి షాకే తగిలిందిగా..

ABN, First Publish Date - 2023-07-02T17:38:13+05:30

ముందూ వెనుకా ఆలోచించకుండా.. కొందరు యువకులు చేసే పిచ్చి పిచ్చి పనులు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కొందరు, సమాజంలో హీరో అనిపించుకోవాలని ఇంకొందరు.. సమయం, సందర్భం లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందూ వెనుకా ఆలోచించకుండా.. కొందరు యువకులు చేసే పిచ్చి పిచ్చి పనులు చివరకు చాలా దూరం వెళ్తుంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని కొందరు, సమాజంలో హీరో అనిపించుకోవాలని ఇంకొందరు.. సమయం, సందర్భం లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొందరు కారుపై కేకులు కట్ చేసి హడావుడి చేశారు. చివరకు వీడియో వైరల్ అవడంతో పోలీసులు వారికి గట్టి షాక్ ఇచ్చారు..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలోని ఓ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకల (Birthday celebrations) పేరుతో కొందరు యువకులు రద్దీ రోడ్డుపై హల్‌చల్ చేశారు. రాత్రి వేళ కారులో రోడ్డు పైకి వచ్చిన యువకులు రోడ్డు పక్కన వాహనం ఆపారు. చాలా కేకులను (cakes) బయటికి తీసి, కారు ఇంజిన్‌పై పెట్టి వేడుకలు మొదలెడతారు. మరికొందరు రోడ్డుపై (Young people burst firecrackers on the road) పటాకులు కాల్చుతూ హల్‌చల్ చేస్తారు. ఓ యువకుడు పటాకుల డబ్బాను చేత్తో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ గాల్లోకి కాలుస్తాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా వారు ప్రమాదంలో పడడమే కాకుండా మిగతా వాహనదారులనూ ప్రమాదంలో నెట్టేసేవారు.

Viral Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇలాంటి పని మాత్రం చేయొద్దు.. ఈ యువకుడి విషయంలో ఏం జరిగిందో చూడండి..

అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) నెట్టింట వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో యువకులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వేడుకలు చేసుకోవడానికి వీరికి స్థలం ఎక్కడా దొరకలేదేమో’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరిగేది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇలాంటి భర్త ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే.. వదిలేయడం బెటర్.. అంటూ ఆ భార్యకు అంతా సలహాలు ఎందుకిస్తున్నారంటే..!

Updated Date - 2023-07-02T17:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising