Jawan Movie: పోలీసుల వాడకం మామూలుగా లేదుగా.. జవాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ గెటప్స్‌తో సూపర్ మెసేజ్..!

ABN , First Publish Date - 2023-09-09T15:48:59+05:30 IST

కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ``జవాన్`` సినిమా థియేటర్లలోనికి వచ్చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై ``జవాన్`` దుమ్మురేపుతున్నాడు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్నాడు. అభిమానులు భారీ సంఖ్యలో ``జవాన్`` థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు.

Jawan Movie: పోలీసుల వాడకం మామూలుగా లేదుగా.. జవాన్ సినిమాలో షారూఖ్ ఖాన్ గెటప్స్‌తో సూపర్ మెసేజ్..!

కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ (Shahrukh Khan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ``జవాన్`` (Jawan)సినిమా థియేటర్లలోనికి వచ్చేసింది. సిల్వర్ స్క్రీన్‌పై ``జవాన్`` దుమ్మురేపుతున్నాడు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతున్నాడు. అభిమానులు భారీ సంఖ్యలో ``జవాన్`` థియేటర్ల ముందు క్యూలు కడుతున్నారు. తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్ బయట కింగ్ ఖాన్‌ భారీ పోస్టర్లు ఏర్పాటు చేసి, పూల మాలలు వేసి, క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

అభిమానులకు మాత్రమే కాదు.. నాగ్‌పూర్ పోలీసులకు (Nagpur police) కూడా ``జవాన్`` సినిమా బాగా నచ్చినట్టు ఉంది. ఆ సినిమా పోస్టర్‌తో నాగ్‌పూర్ పోలీసులు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ను ఉపయోగించుకుని సైబర్ మోసాలపై (Cyber Frauds) పోలీసులు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ``జవాన్`` సినిమాలో షారూక్ ఐదు విభిన్న గెటప్‌ల్లో కనిపించాడు. ఆ ఐదు గెటప్‌ల్లో షారూక్ ఉన్న పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి ``ఇలా ఐదు అకౌంట్లకు ఐదు విభిన్న పాస్‌వర్డ్‌లను (Passwords) పెడితే ఏ మోసగాడూ ఏమీ చేయలేడు`` అని పేర్కొన్నారు.

Viral Video: ఈ వీడియో చూస్తే కోతిని మెచ్చుకోకుండా ఉండలేం.. పిల్లి పాలు తాగుతుండగా వెనక కూర్చున్న వానరం ఏం చేసిందంటే..

నాగ్‌పూర్ పోలీసులు చేసిన ఈ పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై వినియోగదారులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ``మీ పాస్‌వర్డ్‌లు కింగ్ ఖాన్ మొహాల్లా విభిన్నంగా ఉండనివ్వండి``, ``అన్ని ఖాతాలకూ ఒకే పాస్‌వర్డ్ మీ కొంప ముంచుతుంది``, ``ఇకపై పాస్‌వర్డ్‌లు పెట్టేముందు జవాన్ సినిమాను గుర్తుకుతెచ్చుకోండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-09T15:48:59+05:30 IST