Businessman: బ్యాంకు నుంచి ఫోన్.. వాళ్లు చెప్పింది విని విస్తుపోయిన వ్యాపారవేత్త.. తన రోగాలకూ భార్యే కారణమని తెలిసి..!
ABN, First Publish Date - 2023-08-09T20:37:55+05:30
ఆ దంపతుల మధ్య లేటు వయసులో అనూహ్య గొడవలు వచ్చి పడ్డాయి. చివరకు ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారాయి. దీనికితోడు ఉన్నట్టుండి భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంత మంది వైద్యులకు చూపించినా అంతా ఒకే మాట చెబుతున్నారు. ఎందుకిలా జరుగుతోందని..
ఆ దంపతుల మధ్య లేటు వయసులో అనూహ్య గొడవలు వచ్చి పడ్డాయి. చివరకు ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా మారాయి. దీనికితోడు ఉన్నట్టుండి భర్త ఆరోగ్యం క్షీణించింది. ఎంత మంది వైద్యులకు చూపించినా అంతా ఒకే మాట చెబుతున్నారు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తున్న సమయంలో బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. చివరకు తన రోగాలకూ భార్యే కారణమని తెలిసి షాక్ అయ్యాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైకి (Mumbai) చెందిన జోహ్రీ అనే నగల వ్యాపారికి ఇటీవల వింత సమస్య వచ్చి పడింది. ఇతడికి 1989లో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో కొందరికి వివాహాలు కూడా జరిగాయి. అయితే జోహ్రీకి, తన భార్యకు మధ్య కొన్నేళ్లుగా (Quarrels between couples) గొడవలు జరుగుతున్నాయి. అవి రాను రాను మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో 2018లో జోహ్రీ భార్య తన తల్లితో కలిసి భర్తను హత్య చేసేందుకూ కుట్ర పన్నింది. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్‌లను జోహ్రీకి తన కోడలు పంపించింది. తన భార్య భోజనంలో విషం (poison) కలుపుతోందనే అనుమానంతో జోహ్రీ స్వయంగా వండుకోవడం, లేదా రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసి తెప్పించువడం చేస్తుండేవాడు. దీంతో అప్పటి నుంచి జోహ్రీ భార్య (wife) వంట వండడమే మానేసింది. కోవిడ్ సమయంలో రెస్టారెంట్లు మూత పడడంతో జోహ్రీ తరచూ పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అనంతర కాలంలో ముంబైలోనే మరో ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒక్కడే అందులోకి మారాడు. అయితే అటు తర్వాత అతడికి అనారోగ్య సమస్య వచ్చి పడింది. వైద్యులకు చూపించగా.. శరీరం ఇన్పెక్షన్ బారిన పడినట్లు చెప్పారు. మందులు వాడినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా.. వాడడం మానేయగానే మళ్లీ అనారోగ్యానికి గురయ్యేవాడు. ఇదిలావుండగా, 2022 డిసెంబర్‌లో బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘జాయింట్ లాకర్‌కు అద్దె చెల్లించలేదు, వచ్చి లాకర్‌ను ఖాళీ చేసుకోండి’’.. అని చెప్పడంతో బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే లాకర్‌లో (Bank Locker) తన కూతురు పెళ్లి కోసం దాచిన నగలన్నీ కనిపించలేదు. దీంతో చివరకు తన భార్య, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య తనను చంపేందుకు చేతబడి చేయించిందని ఆరోపించాడు. ఈ కేసులో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 5న వ్యాపారి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
Updated Date - 2023-08-09T20:37:55+05:30 IST