Shocking News: స్నేహితుడి శవాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌లో పెట్టి దాచేశాడు.. ఎందుకిలా చేశాడో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!
ABN, First Publish Date - 2023-05-04T22:04:14+05:30
స్నేహితుడికి కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తులున్న ఈ సమాజంలో.. ప్రాణ స్నేహితులను సైతం ప్రాణాలు తీసే కర్కోటకులూ ఉన్నారు. కొందరైతే తోటి మనుషుల పట్ల పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు చేసే దారుణాలు.. పోలీసులు కూడా ..
స్నేహితుడికి కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తులున్న ఈ సమాజంలో.. ప్రాణ స్నేహితులను సైతం ప్రాణాలు తీసే కర్కోటకులూ ఉన్నారు. కొందరైతే తోటి మనుషుల పట్ల పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు చేసే దారుణాలు.. పోలీసులు కూడా నివ్వెరపోయేలా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన స్నేహితుడి శవాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచాడు. అతను ఎందుకు ఇలా చేశాడో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
బ్రిటన్‌లోని (Britain) బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏళ్లు పైబడిన జాన్ రైట్, డేనియల్ అనే వ్యక్తులు మంచి స్నేహితులు. వీరి ద్దరూ బర్మింగ్‌హామ్ సిటీ సెంటర్‌లోని ఓ ఒంట్లో చాలా ఏళ్లుగా సహజీవనం (Live in relationship) చేస్తున్నారు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో జాన్ రైట్ చనిపోయాడు. అతడి మృతదేహాన్ని ఖననం చేయాల్సిన డేనియల్.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఖననం చేస్తే అతడికి సంబంధించిన డబ్బులు తనకు చెందవనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ వేశాడు. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో (dead body hidden in the fridge) దాచి పెట్టాడు. అనంతరం మృతుడి వేలిముద్రలు ఉపయోగించి.. అతడి బ్యాంకు ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేసుకున్నాడు.
ఆ డబ్బులతో షాపింగ్ చేస్తూ జల్సాలు చేస్తూ ఉండేవాడు. అలాగే జాన్ రైట్ పేరున వచ్చే పింఛన్‌ను కూడా తీసుకునేవాడు. ఇలా రెండేళ్ల పాటు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే 2020లో అనూహ్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. చివరకు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో (Court) హాజరుపరిచారు. అయితే తాను ఖర్చు చేసిన డబ్బు మొత్తం తనదే అని డేనియల్ న్యాయవాది తెలిపాడు. తాజాగా ఈ కేసుపై విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ (Bail) మంజూరు చేసి, నవంబర్ 7న కోర్టులో హాజరు కావాలని తెలిపింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..
Updated Date - 2023-05-04T22:04:14+05:30 IST