ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MegaStarChiranjeevi: భారతదేశ సినిమాకే గర్వకారణం రామ్ చరణ్

ABN, First Publish Date - 2023-02-23T12:22:15+05:30

ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా స్టార్ చిరంజీవి (#MegaStarChiranjeevi) తన కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించారు, ఎన్నో చూసారు, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ ఇవన్నీ ఎంత ఆనందాన్ని ఇచ్చినా, కొడుకు అందుకున్న విజయాలు, ఎదుగుదల ఇచ్చిన ఆనందం మాత్రం వాటన్నిటీ కన్నా చాలా ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి అదే ఆనందాన్ని పొందుతున్నారు. తన కుమారుడు, అగ్ర నటుల్లో ఒకడు అయిన రామ్ చరణ్ (#RamCharan), ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం భారతీయ కథానాయకులలో ఈ ఘనత అందుకున్నది కూడా ఆయనే.

'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా షూటింగ్, తర్వాత సంగతులతో పాటు కొత్త సినిమాల గురించి రామ్ చరణ్ ఈ షోలో మాట్లాడారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో సందరి చేస్తున్నారు. అమెరికాలో ఎక్కడ చూసిన రామ్ చరణ్ పేరే మారుమోగుతోంది. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి అయ్యప్ప మాలలో బయలు దేరి వెళ్లిన రామ్ చరణ్ అమెరికా వెళ్ళాక, అది ఇంకా అతని వర్క్ కి సంబదించిన వ్యవహారం కావున, ఆ వర్క్ కి తగ్గ బట్టలు వేసుకున్నారు. అలాగే ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ (#HollywoodCriticsAssociation) ప్రోగ్రాంలో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ప్రజెంటర్ గా అవార్డ్ ఇవ్వనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ నటుడు కూడా చరణ్ కావడం గమనార్హం.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (Golden Globe Awards) ప్రోగ్రాంలో రామ్ చరణ్ కు అమెరికన్ ఆడియన్స్ నుంచి హ్యుజ్ రెస్పాన్స్ లభించింది. ఇండియన్, గ్లోబల్ ఫ్యాన్స్ ఆయన్ను మీట్ కావడం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.

రామ్ చరణ్ కి లభిస్తున్న ఈ ఆదరణ చూసి, తండ్రిగా చిరంజీవి ఆనందం ఇంతా అంతా కాదు. చిరంజీవి తన ఆనందాన్ని సాంఘీక మాధ్యమం లో వ్యక్తపరుస్తూనే, క్రెడిట్ మాత్రం 'ఆర్.ఆర్.ఆర్' (RRR) దర్శకుడు రాజమౌళి (#SSRajamouli) కి ఇచ్చారు. అతని వల్లే ఇదంతా సాధ్యం అయిందని చెప్పారు. అది చిరంజీవి గారి గొప్పతనం.

Updated Date - 2023-02-23T12:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising