ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Big blow: భారీగా క్షీణించిన రిషి సునాక్ దంపతుల సంపద.. ఏడాదిలోనే వేల కోట్లు ఆవిరి..!

ABN, First Publish Date - 2023-05-21T10:28:28+05:30

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్‌ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షత మూర్తిల (Akshata Murthy) సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్‌ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట. దాంతో ప్రస్తుతం వారి సంపద 529 మిలియన్‌ పౌండ్లకు (రూ.5,448 కోట్లు) పడిపోయింది. గతేడాది 730 మిలియన్‌ పౌండ్ల (రూ.7,104 కోట్లు) సంపదతో యూకే ధనవంతుల జాబితాలో ఈ దంపతులు 222వ స్థానంలో ఉంటే.. ఈ ఏడాది వారి సంపద భారీగా తగ్గడంతో 275వ స్థానానికి పడిపోయారు.

ఇక రిషి దంపతుల సంపద ఇలా ఏడాది వ్యవధిలో వేల కోట్లు హాంఫట్ కావడానికి ప్రధాన కారణం ఇన్ఫోసిస్ షేర్ల పతనం అని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌‌లో (Infosys) అక్షత షేర్ల విలువ తగ్గిపోవడమే వారి సంపద భారీగా కరిగిపోవడానికి కారణమైంది. కాగా, సునాక్ దంపతుల సంపదలో అధిక భాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలోనే ఉంది. ఇన్ఫోసిస్‌లో అక్షత ఏకంగా 64 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు. ఆ సంస్థ మొత్తం షేర్లలో ఇది ఒక శాతం. అయితే, గత ఏడాది నుంచి ఆ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో రిషి దంపతుల సంపద కూడా అదే స్థాయిలో క్షీణించిందని నివేదికలు తెలిపాయి. మరోవైపు ఈ ఏడాది కూడా 35 మిలియన్‌ పౌండ్ల సంపదతో ఇంగ్లండ్ సంపన్నుల జాబితాలో భారత సంతతికి చెందిన హిందుజా కుటుంబమే తొలి స్థానాన్ని దక్కించుకుంది.

WhatsApp: ఎల్లలు దాటిన వాట్సాప్ సందేశం.. ఆఫ్రికాలో ఉన్న తండ్రికి తెలుగునాట తప్పిపోయిన బిడ్డ ఆచూకీ తెలిసిందిలా..

Updated Date - 2023-05-21T10:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising