ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అర్ధరాత్రి గుర్రంపై చోరీకి వచ్చిన దొంగలు.. తీరా గుడిలో హుండీ ఎత్తుకెళ్లే సమయంలో.. ఊహించని షాక్..

ABN, Publish Date - Dec 24 , 2023 | 07:32 PM

దొంగలు చోరీ చేసే విధానం కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొందరైతే ఎవరికీ రాకుండా జనంలో కలిసిపోయి చివరికి అందరికీ షాక్ ఇస్తూ చోరీలు చేస్తుంటారు. అయితే...

దొంగలు చోరీ చేసే విధానం కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తుంటుంది. కొందరైతే ఎవరికీ రాకుండా జనంలో కలిసిపోయి చివరికి అందరికీ షాక్ ఇస్తూ చోరీలు చేస్తుంటారు. అయితే ఎక్కడైనా సాధారణంగా బైకులు, కార్లలో వచ్చి చోరీలకు పాల్పడే వారిని చూస్తూ ఉంటాం. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ఆలయంలో చోరీ చేసేందుకు అర్ధరాత్రి గుర్రంపై వచ్చారు. అయితే తీరా హుండీ ఎత్తుకెళ్లే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్‌లోని బర్రా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 20న రాత్రి ఇద్దరు దొంగలు గుర్రంపై ఆలయం వద్దకు వచ్చారు. ఓ వ్యక్తి గుర్రంపై కూర్చుని ఉండగా.. మరో వ్యక్తి ఆలయంలోకి వెళ్లి హుండీలోని నగదును ( thieves tried to steal the cash from hundi) ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాకపోవడంతో శతవిధాలా ప్రయత్నించాడు. అయినా హుండీలో డబ్బులు తీయడం అతడి వల్ల సాధ్యం కాలేదు. ఇంతలో పక్కనే రోడ్డుపై పడుకున్న కుక్కలు.. దొంగలను చూసి మొరగడం మొదలెట్టాయి.

Viral Video: రైలు ఎక్కుతుండగా.. పిల్లలతో సహా కిందపడిన మహిళ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..

కుక్కలు మొరగడతో వారిలో ఒక్కసారిగా భయం మొదలవుతుంది. ఇంతలో మరికొన్ని కుక్కలు అక్కడికి వస్తాయి. ఈలోగానే వాటి అరుపులకు పక్కన ఉన్న వారు నిద్రలేస్తారు. దీంతో దొంగలు వెంటనే అలెర్ట్ అవుతారు. వెంటనే అక్కడి నుంచి పరుగందుకుంటారు. గుర్రంలో ఓ వ్యక్తి పారిపోగా.. మరో వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. స్థానికులు కొద్ది దూరం వారిని వెంబడిస్తారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి పీటలపై వధువు నిర్వాకానికి అవాక్కైన వరుడు.. చివరకు ఎవరికీ తెలీకుండా ఎలా మ్యానేజ్ చేశాడో చూడండి..

Updated Date - Dec 24 , 2023 | 07:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising