scorecardresearch

18 Crores Lottery: 18 కోట్ల లాటరీ తగిలిందని ఆనందించేలోపే పెద్ద ట్విస్ట్.. ఆ ఒక్క ఈ-మెయిల్‌తో..

ABN , First Publish Date - 2023-08-14T16:08:53+05:30 IST

ఏం చేయకుండానే కొందరిని అదృష్టం వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. అయితే.. ఇలా వచ్చిన డబ్బుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక, చేజేతులా...

18 Crores Lottery: 18 కోట్ల లాటరీ తగిలిందని ఆనందించేలోపే పెద్ద ట్విస్ట్.. ఆ ఒక్క ఈ-మెయిల్‌తో..

ఏం చేయకుండానే కొందరిని అదృష్టం వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. అయితే.. ఇలా వచ్చిన డబ్బుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక, చేజేతులా మొత్తం సర్వనాశనం చేసుకుంటారు. అందనంత స్థాయికి చేరినట్టే చేరి, తిరిగి జీరోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఓ జంట కూడా అలాంటి దుస్థితినే ఎదుర్కుంది. ఒక లాటరీ పుణ్యమా అని ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిన ఆ జోడీ.. ఆ డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు చేసింది. కేవలం ఎంజాయ్ చేసేందుకు మొత్తం డబ్బుని తగలబెట్టేశారు. నయా పైసా మిగిలించుకోకుండా వృధా చేశారు. ఇది చాలదన్నట్టు.. ఒక ఈ-మెయిల్ వీరి జీవితాన్ని మరింత దుర్భరం చేసింది కూడా! పదండి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులై, ఆ తర్వాత కొన్నాళ్లకే రోడ్డున పడ్డ ఆ జంట స్టోరీ ఏంటో మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఇంగ్లండ్‌కు చెందిన రోజర్‌, లారా గ్రిఫిథ్స్‌లు 2005లో నేషనల్‌ లాటరీలో జాక్‌పాట్‌ కొట్టారు. ఆ లాటరీ ద్వారా 1.8 మిలియన్ పౌండ్స్ (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.18 కోట్లు) సొంతం చేసుకున్నారు. అంత డబ్బు వచ్చేసరికి వీరి కళ్లు నెత్తికెక్కాయి. హద్దు లేకుండా ఖర్చు చేయడం మొదలుపెట్టారు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశారు. షాపింగ్, టూర్స్, షికార్లకంటూ.. భారీ ఖర్చులు వెచ్చించారు. 670,000 పౌండ్స్ వెచ్చించి నార్త్‌ యార్క్‌షైర్‌లో ఒక భవనాన్ని కొనుగోలు చేశారు కానీ, అది 2010 న్యూయార్క్ వేడుకల సమయంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. అయినా వీళ్లు వెనక్కు తగ్గలేదు. లాటరీ డబ్బులున్నాయి కదా అని.. ఖర్చులు చేస్తూ వచ్చారు. 2013 నాటికల్లా.. అంటే 8 ఏళ్లలో మొత్తం లాటరీ డబ్బంతా ఖర్చైపోయింది. ఆ తర్వాతి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి.

అదే సమయంలో రోజర్‌కు వచ్చిన ఒక ఈమెయిల్.. ఈ దంపతుల జీవితాల్ని మరింత దుర్భరం చేసింది. అందులో ఒక స్నేహితుడికి పరాయి యువతి ఫోన్ నంబర్ రోజర్ అడిగినట్టు లారా గమనించింది. ఆ యువతికి సంబంధించి రోజర్, అతని స్నేహితుడి మధ్య జరిగిన సంభాషణని లారా చూసింది. దీంతో.. తనని మోసం చేస్తున్నాడని గుర్తించి రోజర్‌ని లారా నిలదీసింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో.. రోజర్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజర్‌ని సంప్రదించేందుకు తాను ఎంతో ప్రయత్నించానని, చివరికి ఫేస్‌బుక్‌లో అతని ఖాతా కోసం సెర్చ్ చేశానని లారా తెలిపింది. కానీ.. అతడు అన్నింటిలోనూ తనని బ్లాక్ చేశాడని పేర్కొంది. అలా తామిద్దరం విడిపోయామని చెప్పింది.

Updated Date - 2023-08-14T16:08:53+05:30 IST