ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

ABN, First Publish Date - 2023-02-21T18:30:45+05:30

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు. ఈ వేడుకలో భాగమైన తారలు స్టైలిష్‌ దుస్తుల్లో మెరిసి అలరించారు. చిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సేవలు అందించినందుకుగానూ 2023 సంవత్సరానికి దాదా సాహెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును రేఖ అందుకున్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Ss rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (RRR Film of the year) అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్‌ఫైల్స్‌’ (The kashmiri Files) అవార్డు దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్యాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న ‘కాంతారా’(Kanthara)లో అద్భుతమైన నటనకుగానూ రిషబ్‌శెట్టి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా అలియాభట్‌ (alia bhatt) (గంగూబాయి కతియావాడి)(Gangubhai katiyawadi)సినిమాలకు పురస్కారాలు అందుకున్నారు. అయితే షూటింగ్‌ పనులతో బిజీగా ఉన్న రణ్‌బీర్‌ హాజరుకాలేకపోవడంతో ఆయన భార్య అలియాభట్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

అవార్డు విజేతలు వీరే...

ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆర్‌ఆర్‌ఆర్‌(RRR Film of the year)

ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)

ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)

ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కతియావాడి)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (Rishab shetty కాంతారా)

బెస్ట్‌ యాక్టర్‌(క్రిటిక్స్‌): వరుణ్‌ ధావన్‌ (బేడియా)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): విద్యాబాలన్‌ (జల్సా)

వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌

ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్‌ తాండన్‌

ఉత్తమ సహాయ నటుడు: మనీష్‌ పాల్‌

వెబ్‌ సిరీస్‌ కేటగిరీ...

ఉత్తమ వెబ్‌సిరీస్‌: రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌

ఉత్తమ నటుడు: జిమ్‌ షార్బ్‌ (రాకెట్‌ బాయ్స్‌)

టెలివిజన్‌ సిరీస్‌ ఆఫ్‌ ఆది ఇయర్‌: అనుపమ

టీవీ కేటగిరీ...

ఉతమ నటుడు: జైన్‌ ఇమనాన్‌

ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్‌

ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా

Updated Date - 2023-02-21T19:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising