Shocking: పొద్దునే రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య కార్మికులకు దూరంగా కనిపించిందో ఆకారం.. అనుమానంగానే దగ్గరకు వెళ్లి చూస్తే..
ABN, First Publish Date - 2023-05-27T18:29:47+05:30
అదో జాతీయ రహదారి. నిత్యం వివిధ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇదిలావుండగా, ఓ రోజు ఉదయం పారిశుధ్య కార్మికులు రోడ్డు ఊడ్చే పనుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పనుల్లో బిజీగా ఉన్న కార్మికులకు దూరంగా ఏదో ఆకారం కనిపించింది. ఎవరో..
అదో జాతీయ రహదారి. నిత్యం వివిధ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇదిలావుండగా, ఓ రోజు ఉదయం పారిశుధ్య కార్మికులు రోడ్డు ఊడ్చే పనుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పనుల్లో బిజీగా ఉన్న కార్మికులకు దూరంగా ఏదో ఆకారం కనిపించింది. ఎవరో మనిషి రోడ్డుపై పడిపోయినట్లుగా ఉండడంతో చూద్దామని దగ్గరికి వెళ్లారు. అయితే తీరా అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మథురలోని ధరమ్‌వీర్ శిక్షణా కేంద్రం ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక జాతీయ రహదారి-19 (National Highway-19) పై శుక్రవారం ఉదయం పారిశుధ్య కార్మికులు (Sanitation workers) క్లీనింగ్ పనుల్లో ఉన్నారు. రోడ్డును ఊడుస్తున్న వాళ్లకు దూరంగా ఏదో ఆకారం కనిపించింది. ఎవరో రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించి కంగారుగా వెళ్లి చూశారు. చివరకు అక్కడి దృశ్యం కూసి షాక్ అయ్యారు. గుర్తు తెలియని యువకుడి మృతదేహం (young man dead body) నుజ్జునుజ్జయి రోడ్డంతా చెల్లాచెదురుగా పడి ఉంది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడి మొఖం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. గురువారం రాత్రి సదరు యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో (young man died being hit vehicle) అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. రాత్రంతా పలు వాహనాలు మృతదేహాన్ని తొక్కుకుంటూ వెళ్లాయి. రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు కూడా గుర్తించకపోవడం గమనార్హం. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలూ లభించకపోవడంతో అతని గర్తింపు సాధ్యం కాలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో హోటళ్ల యజమానులను విచారిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-05-27T18:29:47+05:30 IST